Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bachchan missed Om Shanti Om' Deewangi Deewangi amid wedding week

పెళ్లి పిలుపు రాలేద‌ని సెట్స్ కి క్యూ క‌ట్టేసారా?

Bachchan missed Om Shanti Om' Deewangi Deewangi amid wedding week

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఫరా ఖాన్ తెరకెక్కించిన `ఓం శాంతి ఓం` సినిమాలోని `దీవంగి దీవంగి` సాంగ్ హిందీ చలనచిత్ర పరిశ్రమలోనే  మైలురాయిగా నిలిచిపోయింది.  31 మంది అగ్ర నటీనటులు ఒకే వేదికపై సందడి చేసిన పాట చిత్రీకరణ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను దర్శకురాలు ఫరా ఖాన్  గుర్తు చేసుకున్నారు. ఈ ఐకానిక్ సాంగ్‌లో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కనిపించకపోవడానికి గల అసలు కారణాన్ని  వెల్లడించారు. ఆ సమయంలోనే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్‌ల వివాహం జరగడమే ఇందుకు ప్రధాన కారణమని.. ఆ పెళ్లి పనుల వల్ల అమితాబ్ షూటింగ్‌కు రాలేకపోయారని తెలిపారు.

ఈ పెళ్లి ప్రస్తావనతోనే ఫరా ఖాన్ ఓ  సరదా వ్యాఖ్య కూడా చేశారు. అభిషేక్-ఐశ్వర్యల వివాహానికి బాలీవుడ్ పరిశ్రమలోని చాలా మందికి ఆహ్వానం అందలేదని అందువల్లే సెలబ్రిటీలందరూ ఖాళీగా ఉండి తన పాట షూటింగ్‌కు తరలివచ్చారంటూ చమత్కరించారు. అమితాబ్‌తో పాటు ఆమిర్ ఖాన్, దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్ వంటి దిగ్గజాలు కూడా కొన్ని వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాల వల్ల ఈ పాటలో భాగం కాలేకపోయారని  తెలిపారు. ముఖ్యంగా ఆమిర్ ఖాన్ అప్పట్లో తారే జమీన్ పర్ సినిమా ఎడిటింగ్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల రాలేనని చెప్పగా, దేవ్ ఆనంద్  సినిమాల్లో అతిథి పాత్రలు చేయనని సున్నితంగా తిరస్కరించినట్లు ఫరా పేర్కొన్నారు.

ఈ పాట కేవలం ఒక నృత్య ఘట్టం మాత్రమే కాదని..బాలీవుడ్ అంతా ఒకే కుటుంబంగా కలిసి పండగ చేసుకున్న సందర్భమని ఫరా ఖాన్ అభివర్ణించారు. షూటింగ్ పూర్తయినప్పటికీ నటీనటులు క్యారవాన్‌లకు వెళ్లకుండా సెట్స్‌లోనే ఉండి ఇతరుల ప్రదర్శనలను చూస్తూ ఎంజాయ్ చేసార‌ని  గుర్తు చేసుకున్నారు. ఈ పాటలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నిర్మాత షారుఖ్ ఖాన్ లక్ష రూపాయల విలువైన లగ్జరీ గిఫ్ట్ హ్యాంపర్లను బహుమతిగా ఇచ్చారని.. అలాగే మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌ను కూడా వారికే సొంతం చేసుకునేలా అవకాశం కల్పించారని వెల్లడించారు. పరిశ్రమలోని ఎందరో తారలను ఒకే చోటకు చేర్చి హిందీ సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుం డిపోయేలా  పాటను నిలిపిన ఆ రోజులు ఎంతో మధురమైనవని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
 

Farah Khan Reveals Real Reason Why Amitabh Bachchan Skipped Shooting