Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Akanksha Chamola has disclosed on Lock Upp Season 2

విడాకుల నిర్ణ‌యంతో షాక్ ఇచ్చిన జోడీ!

Akanksha Chamola has disclosed on Lock Upp Season 2

ప్రముఖ టెలివిజన్ నటీమణి ఆకాంక్ష చమోల వైవాహిక జీవితం గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట  చర్చనీయాంశంగా మారాయి. ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమవుతున్న రియాలిటీ షో లాకప్ సీజన్ 2 వేదికగా అమ్మ‌డు  వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. తాను -తన భర్త అయిన  నటుడు గౌరవ్ ఖన్నా ఏడాది కాలంగా విడివిడిగా జీవిస్తున్నామని.. త్వ‌ర‌లో విడాకులు తీసుకుంటున్న‌ట్లు  అధికారికంగా వెల్లడించారు. ఈ వార్త  అభిమానులను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది.

తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఇద్దరి ఆలోచనా విధానాలు, భవిష్యత్తు లక్ష్యాలు వేరుగా ఉండటం వల్లే పరస్పర అంగీకారంతోనే  విడాకుల నిర్ణయం తీసుకున్నట్లు ఆకాంక్ష తెలిపారు. ముఖ్యంగా పిల్లలను కనే విషయంలో ఇద్దరి మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. గౌరవ్‌కు పిల్లలు కావాలని బలంగా కోరుకుం టున్నారని, కానీ తనకు మొదటి నుండి తల్లి కావాలనే ఆసక్తి లేకపోవడమే ఈ బంధం ముగిసిపోవడానికి ముఖ్య కారణమని  వివరించారు.

వైవాహిక బంధం ముగింపు దశకు చేరిన నేపథ్యంలో ఆకాంక్షకు సంబంధించిన పాత విషయాలు కూడా  హాట్ టాపిక్‌గా మారాయి. వివాహానికి ముందు తన లైంగిక ధోరణి వేరుగా ఉండేదని.. తాను బైసెక్సువల్ అనే విషయాన్ని కూడా  ఈ సందర్భంగా బయటపెట్టారు. ఓవైపు  ఆకాంక్ష ఈ విషయాలన్నింటినీ బాహాటంగా చెప్తుండగా మరోవైపు గౌరవ్ ఖన్నా మాత్రం ఆమెకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని..  భార్య పట్ల ప్రేమ ఎప్పటికీ మారదని సానుకూలంగా స్పందించడం గమనార్హం.
 

Akanksha Chamola admits she was bisexual before marrying Gaurav Khanna