పెళ్లి తో ఒక్కటైన ఆమిర్-గౌరీ స్ప్రాట్
Aamir Khan and Gauri Spratt are now officially married
బాలీవుడ్ స్టార్ ఆమిర్ పెళ్లి చేసుకున్నారు. తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్ ని ఆమిర్ ఖాన్ ఈరోజు అంటే జులై 5 ఆదివారం ముంబై లోని బాంద్రా లో తన నివాసంలో సింపుల్ గా కుటుంబ సభ్యుల నడుమ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ వివాహంలో ఆమిర్-గౌరీ స్ప్రాట్ లు పత్రాలపై సంతకాలు చేసారు.
అందుకు సంబందించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమిర్-గౌరీ స్ప్రాట్ లు ఇద్దరూ కుటుంబ సభ్యులు, ఆమిర్ కుమారులు జునైద్ ఖాన్, ఆజాద్ రావ్ ఖాన్, కుమార్తె ఇరా ఖాన్ తో పాటు గౌరీ స్ప్రాట్ తనయుడి సమక్షంలో వివాహ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమిర్ టీం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
అంతేకాకుండా అమిర్-గౌరీ వివాహ వేడుకకు రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీతో సహా పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. ఆమిర్ ఖాన్ ఇప్పటికే రెండు వివాహాలు చేసుకుని వారికీ విడాకులు ఇచ్చి 60 ఏళ్ళ వయసులో గౌరీ ని మూడో వివాహం చేసుకున్నారు. ఆమిర్ ఖాన్ కే కాదు గౌరికి కూడా గతంలో వివాహమై విడాకులు తీసుకుని ఇప్పుడు ఆమిర్ ని రెండో పెళ్లి చేసుకున్నారు.








































