Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> The audience will be thrilled by the massive action scene in Spirit

స్పిరిట్ భారీ యాక్ష‌న్ సీన్ కి ప్రేక్ష‌కుడు థ్రిల్ అవుతాడు

The audience will be thrilled by the massive action scene in Spirit

రెబ‌ల్ స్టార్ ప్రభాస్ క‌థానాయ‌కుడిగా సందీప్ రెడ్డి వంగా  ద‌ర్శ‌క‌త్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం `స్పిరిట్`. పవర్‌ఫుల్ కాప్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాపై అటు ఇండస్ట్రీలోనూ.. ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఇందులో ప్రభాస్‌కు జోడీగా త్రుప్తి దిమ్రి నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఇంటర్వెల్ బ్లాక్ కోసం చిత్ర బృందం భారీ సెట్స్ వేస్తోందని అందులో ప్రభాస్‌పై వంద మంది ఫైటర్లతో  భారీ యాక్షన్ ఫైట్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా  పంథాకు భిన్నంగా కు డిఫ‌రెంట్ యాంగిల్ లో ఈ యాక్ష‌న్ స‌న్నివేశం ఉంటుంద‌ని చెబుతున్నారు. వెండి తెర‌పై ఆ సీన్ చూస్తున్న‌ప్పుడు ప్రేక్ష‌కుడు మునుపెన్న‌డు పొంద‌ని స‌రికొత్త అనుభూతిని పొందుతార‌ని యూనిట్ వ‌ర్గాలు ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి.

ఇప్పటికే విడుదలైన `స్పిరిట్` పోస్టర్ ప్రభాస్‌ను పక్కా వైల్డ్ అండ్ మాస్ అవతార్‌లో చూపిస్తూ సోషల్ మీడియాలో భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. ఇంటర్వెల్ షెడ్యూల్ పూర్తి కాగానే తదుపరి షెడ్యూల్‌లో ఏకంగా క్లైమాక్స్ సీక్వెన్స్‌ను షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారుట‌. అలాగే  సినిమాకు సంగీతం అందిస్తున్న హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే సందీప్‌తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. టి-సిరీస్ -భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో  నిర్మిస్తున్నాయి.

Spirit is gearing up to raise the bar for action and intensity