Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kalyan Ram's first Look from VenkyAnil5

మాయ అంతా రావిపూడి మాయ

Kalyan Ram's first Look from VenkyAnil5

 

నిన్నగాక మొన్న సినిమా స్టార్ట్ చేసారు. అప్పుడే ఒక హీరోగారి ఫస్ట్ లుక్ ని వదలి అభిమానులను సర్ ప్రైజ్ చేసేసారు. ఆ దర్శకుడు ఎవరో గెస్ చేసారా.. అదేనండి అనిల్ రావిపూడి. అనుకున్న సమయానికి సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసే సత్తా ఉన్న ఏకైక దర్శకుడు అనిల్ రావిపూడి.

వెంకటేష్-కళ్యాణ్ రామ్ లతో తన తదుపరి చిత్రాన్ని రీసెంట్ గానే స్టార్ట్ చేసారు. అది కూడా అదిరిపోయే ప్రమోషనల్ వీడియో తో. షూటింగ్ స్టార్ట్ చేసిన చాలా కొద్దిరోజులకే ఈరోజు నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్ డే కి అదిరిపోయే లుక్ వదులుతూ ఆయనకు పుట్టినరోజు శుభాకంక్షాలు తెలిపారు అనిల్ రావిపూడి అండ్ టీం.

షూటింగ్ జెట్ స్పీడు లోనే కాదు హీరోల బర్త్ డైలకు అంతే స్పీడు గా లుక్స్ వదలడంతో ఆయనకు ఆయనే సాటి. మెడలో దండ, కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పట్టు బట్టలతో కళ్యాణ్ రామ్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఓ సాంగ్ లోని లుక్ ని వదిలారు. కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు అనిల్ రావిపూడి అదిరిపోయే ట్రీట్ ఇవ్వగానే నందమూరి అభిమానులు మాయ అంతా అనిల్ రావిపూడి మాయ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Kalyan Ram Birthday - First Look from Anil Ravipudi Film