ఆలియాకి ప్రభాస్ సపోర్ట్ అందుకేనా?

Did Prabhas confirm Alia presence


ఆలియా-శార్వరి, బాబీ డియోల్ కీలక పాత్రల్లో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ ఆల్ఫా చిత్రం విడుదలకు రెడీ అయ్యింది. ఆలియా భట్-శార్వరి లు గూఢచారులుగా తెరకెక్కిన ఆల్ఫాను ఈ ఇద్దరు హీరోయిన్స్ గ్లామర్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఆల్ఫా ట్రైలర్ లో అలియా భట్, శార్వరి ల యాక్షన్ ఆరగొట్టేసి సినిమాపై అంచనాలు పెంచేశారు.

మరోపక్క బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని హీరోయిన్స్ ఇద్దరూ తెగ ప్రమోట్ చేస్తుంటే, సౌత్ నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆలియా భట్ ఆల్ఫా పై ఇన్స్టా లో ట్వీట్ చేసారు. దానితో ప్రభాస్ ప్రత్యేకంగా ఆలియా భట్ ఆల్ఫా ను ప్రమోట్ చేస్తున్నారు అంటే అలియా భట్ నిజంగానే కల్కి 2 లో నటిస్తుందా..

ఇప్పటికే ఆలియా భట్ కల్కి 2 లో కీ రోల్ ప్లే చేస్తుంది అనే ప్రచారం ఉంది. సుమతి పాత్ర నుంచి దీపికా పదుకొనె ను తప్పించి ఆ పాత్ర కోసం సాయి పల్లవి ని సలెక్ట్ చేశారనే టాక్ ఉంది. అంతేకాకుండా అలియా భట్ కూడా కల్కి సీక్వెల్ లో కీలక పాత్రలో కనిపిస్తుంది అనే టాక్ ఉంది. ఇప్పుడు ప్రభాస్ ఆల్ఫా ను సపోర్ట్ చెయ్యడంతో అదే నిజమంటున్నారు. చూద్దాం ఆలియా కల్కి లో కనిపిస్తుందో, లేదో..!

Did Prabhas send indirect signals of Alia casting in Kalii 2898AD sequel?