ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sreeleela reveals how she balanced MBBS exams with shooting

షూటింగ్ చేస్తూ డాక్టర్ ఎగ్జామ్స్ రాసా-శ్రీలీల

Sreeleela reveals how she balanced MBBS exams with shooting


చాలామంది నటులు డాక్టర్ కాబోయి యాక్టర్స్ అయితే.. కొంతమంది నటులుగా అభిరుచి చాటుకుంటూనే డాక్టర్స్ అయినవారు ఉన్నారు. ఈమధ్య కాలంలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ డాక్టర్స్ గా సినిమా ఇండస్ట్రీలో బిజీ ఉన్న హీరోయిన్స్ గా కనిపిస్తున్నారు. అందులో సాయి పల్లవి, శ్రీలీల వంటి హీరోయిన్స్ ఉన్నారు. శ్రీలీల ఈమధ్యనే డాక్టర్ పట్టా అందుకుంది

డాక్టర్స్ డే సందర్భంగా శ్రీలీల తను డాక్టర్ విద్య అభ్యసిస్తూనే నటిగా ఎలా సర్వైవ్ అయ్యిందో చెప్పుకొచ్చింది. జూనియర్ సినిమాలో వైరల్ వయ్యారి సాంగ్ షూటింగ్ చేసున్నప్పుడు ఎంబీబీఎస్ పరీక్షలకు హాజరయ్యాను. డాక్టర్ కావడం నా చిన్నప్పటి కల. అదే నా అతిపెద్ద ఎయిమ్. వైరల్ వయ్యారి షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా నా ఎంబీబీఎస్ పరీక్షలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను.

షూటింగ్ పూర్తి కాగానే ప్రాక్టికల్స్‌ ఎగ్జామ్స్ కి వెళ్లేదాన్ని. మధ్యలో బ్రేక్ వస్తే చాలు సెట్స్‌కు వచ్చి షూటింగ్‌లో పాల్గొనేదాన్ని. ఇది అంత ఈజీ కాదు కానీ.. డాక్టర్ వృత్తి నాకు ఎంతో విలువైనది అంటూ శ్రీలీల చెప్పింది.

Sreeleela shares how she managed MBBS exams while shooting Viral Vayyari