అమెజాన్ ప్రైమ్ పై కేసు

Amazon is being taken to court

 

ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ లీగల్ సమస్యలు ఎదుర్కొంటుంది. కారణం డబ్బులు పెట్టి ఓటీటీ సబ్ స్క్రిప్షన్ కొనుకున్న వినియోగదారులను అమెజాన్ ప్రైమ్ మోసం చేసింది అంటూ ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ కేసు వేసింది. 
అమెజాన్ ప్రైమ్ లో యాడ్స్ ప్రవేశ పెట్టడమే ఈ కేసుకుప్రధాన కారణం.

అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లుకు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ప్రైమ్ లో ప్రకటనలు ప్రసారం చేయడం, ఒకవేళ ఆ యాడ్స్ వద్దు అనుకుంటే.. సబ్‌స్క్రైబర్లు నుంచి అదనపు రుసుము వసూలు చేయడంపై ఆస్ట్రేలియా కాంపిటీషన్ వాచ్‌డాగ్ తీవ్రంగా స్పందించింది. దానితో ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ అమెజాన్‌పై ఫెడరల్ కోర్టులో దావా వేసింది.

అమెజాన్ లో అలా ప్రకటనలు యాడ్ చేసిన సమయంలో 8.5 లక్షల మందికి పైగా ఆస్ట్రేలియన్ వినియోగదారులు వార్షిక చందా చెల్లించి ఉన్నారు. అదనపు రుసుము చెల్లించని వారికి, వారు డబ్బు చెల్లించిన సేవలో కోత విధించినట్లు అయ్యిందని ఏసీసీసీ తన పిటిషన్‌లో పేర్కొంది. అమెజాన్ తన వార్షిక ప్రైమ్ ఒప్పందాలలో అనేక అన్యాయమైన నిబంధనలను చేర్చింది. వాటిని అడ్డం పెట్టుకునే ప్రైమ్ వీడియోలో ప్రకటనలను ప్రవేశపెట్టింది అంటూ మండిపడుతున్నారు.

మరి ఆమెజాన్ ప్రైమ్ ఈ లీగల్ సమస్యను ఎలా ఎదుర్కుంటుందో తెలియదు కానీ, చాలామంది ఇండియన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లు కూడా ఈ యాడ్స్ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
 

Australia sues Amazon for making allegedly unfair contracts with subscribers