లేడీ గ్యాంగ్ తో రాకింగ్ స్టార్ యశ్ ఫైట్

Yash Toxic New Teaser Out


రాకింగ్ స్టార్ యశ్ టాక్సిక్ నుంచి చిన్న సర్ ప్రైజ్ వదిలారు. టాక్సిక్ నుంచి వచ్చిన ఫస్ట్ టీజర్ కి పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో ఇప్పుడు మరో టీజర్ అది కూడా టాక్సిక్ హీరోయిన్స్ తో ఓ పవర్ ఫుల్ టీజర్ వదిలారు మేకర్స్. నయనతార బైక్ పై కనిపించగా కియారా అద్వానీ గ్లామర్ గా పూల్ లో దర్శనమిచ్చింది. తార సుతారియా, రుక్మిణి వసంత్ లతో యశ్ ఫైట్ ఈ టీజర్ లో హైలెట్ అయ్యింది.

మై డియర్ లేడీస్ అండ్ లేడీస్ ఒక్కొక్కరిగా వస్తారా, లేదంటే ఒకేసారి వస్తారా అంటూ యశ్ లేడీ గ్యాంగ్ తో చేసిన స్టైలిష్ ఫైట్ అదిరిపోయింది. యశ్ లుక్స్, నయనతార లుక్స్, కియారా గ్లామర్ లుక్స్, రుక్మిణి వసంత్, తార సుతారియా, హ్యూమా ఖురేషి లేడీ డాన్స్ గా అదరగొట్టేసారు.

ఈ టీజర్ తో టాక్సిక్ లో లేడి పవర్ ఏమిటో పరిచయం చేసారు. టాక్సిక్ మూవీ పాన్ ఇండియా వ్యాప్తంగా ఆగష్టు 26 న విడుదల కాబోతుంది. 

Yash Toxic New Teaser Released