జగన్ మోహన్ రెడ్డి ది పెద్ద ఛాలెంజే
YS Jagan Sensational Comments On AP Capital
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్ద ఛాలెంజే చేసారు. గతంలో అమరావతి రాజధానిని ఒప్పుకున్నట్టే ఒప్పుకుని సీఎం అయ్యాక విశాఖ, అమరావతి, కర్నూల్ అంటూ మూడు రాజధానుల నినాదానికి తెరలేపి.. మూడు ముక్కలాడిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతి ని రాజధానిగా చట్టబద్దం చేసి అక్కడ అభివుద్ది చేస్తుంది.
కానీ జగన్ మోహన్ రెడ్డి మావిగాన్ అంటూ మచిలీపట్టణం నుంచి అమరావతి వరకు రాజధాని నినాదాన్ని ఎత్తుకోవడమే కాదు.. ఈసారి ఎన్నికలకు మ్యానిఫెస్టో లో మావిగాన్ అంశాన్ని చేరుస్తామని.. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి మధ్యనే పోటీ ఉండబోతుంది. మావిగన్ అజెండాతోనే ఎన్నికలకు వెళ్తాం..
మావిగన్ మా నినాదం.. మాకు మద్దతు ఇచ్చేవాళ్లు మాకు ఓటేస్తారు, ఎన్నికల్లో అమరావతో.. మావిగనో తేల్చుకుందాం అంటూ తాడేపల్లి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ చేసారు జగన్. మరి జగన్ నినాదం ఈసారి ఆయన్ని అధికారంలోకి తెస్తుందో, లేదంటే మరోమారు ప్రతిపక్షంలోకి నెడుతుందో చూడాలి.







































