వారణాసి-మహేష్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్
SS Rajamouli shares big update on Varanasi
వరసగా వస్తున్న వారణాసి అప్ డేట్స్ మహేష్ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరో నాలుగు నెలల్లో వారణాసి షూటింగ్ కంప్లీట్ అవుతుంది అని రాజమౌళి ఇచ్చిన అప్ డేట్ తో ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోతుంది. కానీ ఇప్పుడు నాలుగు నెలలు కాదు 80 రోజుల్లోనే వారణాసి షూటింగ్ ఫినిష్ అవుతుంది అంటూ రాజమౌళి తాజాగా చెప్పడం చూసి ఫ్యాన్స్ కి అస్సలు ఆగడం లేదు.
ముందుగా వారణాసి షూటింగ్ అక్టోబర్ చివరి వరకు పూర్తి అవుతుందని అనుకున్నామని, కానీ 80 రోజుల్లోనే టోటల్ సినిమా షూట్ పూర్తయ్యేలా ఉందంటూ ఇప్పుడు రాజమౌళి ప్రకటించారు. మరి రాజమౌళి చెప్పినట్టుగానే వారణాసి చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న రావడం పక్కా.
తండ్రి-కొడుకుల అనుబంధంతో, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ వారణాసి చిత్రం ఉండబోతుంది అంటూ రాజమౌళి వారణాసి బ్యాక్ డ్రాప్ ని రివీల్ చెయ్యడమే కాదు.. అనుకున్నట్టుగా వారణాసి షూటింగ్ ని మహేష్ ఇంకా పృథ్వీ రాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా ల డేట్స్ తో పూర్తి చేసేస్తున్నారు.







































