చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే

Peddi Ticket Prices Slashed in Nizam

 


చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారు అన్న చందాన పెద్ది మేకర్స్ తీరు ఉంది. పెద్ది చిత్రానికి భారీ బడ్జెట్ పెట్టాం, టికెట్ రేట్లు పెంచమని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించిన నిర్మాతలకు పెద్ది చిత్రం ఏమన్ని లాభాలు తెచ్చిపెట్టలేదు. ప్రమోషన్స్ హడావిడిలో ఎలాగో గట్టెక్కుతారు అనుకున్న నిర్మాతలకు ప్రేక్షకులు ఝలక్ ఇచ్చారు. కారణం అధిక టికెట్ ధరలు.

పెద్ది మొదటి వారం వీక్షించిన వాళ్ళు అధికమే. కానీ రెండో వారం నుంచి పెద్ది థియేటర్స్ లో ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. మితిమీరిన బడ్జెట్ లు పెట్టడమెందుకు ఆడియన్స్ నెత్తిన టికెట్ ధరల భారం వెయ్యడమెందుకు. థియేటర్స్ లో సినిమాలు చూసే ఆడియన్స్ సంఖ్య గణనీయంగా తగ్గింది. దానికి ఓటీటీ ఒక కారణమైతే ఈ టికెట్ ధరలు మరో కారణం.

ఇక పెద్ది మూడు వారాలకే ముసుగు తన్నేసింది. ఆ వెంటనే పెద్ది జులై 16 నుంచి ఓటీటీ లో స్త్రీమ్మింగ్ అంటూ ప్రకటించేసారు. ఇక థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్  ఎందుకుంటారు. ఇలాంటి సమయంలో తెలంగాణ లో టికెట్ దర్శలు తగ్గించారు. పెద్ది చిత్రానికి ఈ వారం నుంచి టికెట్ ధరలు తగ్గించారు.

సింగిల్ స్క్రీన్ల రేట్లలో గరిష్ఠ ధరను రూ.105గా పెట్టారు. కానీ ఇది ఎప్పుడో చేసి ఉంటె పెద్ది కలెక్షన్స్ ఇంకా పెరిగేవి. కానీ చేతులు కాలాక పెద్ది మేకర్స్ ఆకులు పట్టుకున్నారు.

Peddi Ticket Prices Slashed in Nizam Ahead of OTT Release