ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bhagyashri Borse in Lenin Trailer Launch

లెనిన్ హీరోయిన్ పేరు మోగిపోతుంది

Bhagyashri Borse in Lenin Trailer LaunchBhagyashri Borse in Lenin Trailer Launch


లెనిన్ టీజర్ అప్పుడే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పేరు తెగ హడావిడి చేసిందని. అంతకుముందు అంటే మిస్టర్ బచ్చన్, కింగ్ డమ్, ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రల్లో భాగ్యశ్రీ నటించినా ఆమె పేరుని ఎవరూ ప్రత్యేకంగా గుర్తు చేసుకోలేదు. అందులోను ఆ సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. దానితో ఆమె పేరు వినిపించలేదు.

కానీ ఇప్పుడు లెనిన్ చిత్రం విడుదలకు ముందే భాగ్యశ్రీ బోర్సే పేరు తెగ హైలెట్ అవుతుంది. అందమైన కళ్ళు, అందుకు తగిన అందం, గ్లామర్ కి గ్లామర్, లంగావోణీ, చీర కట్టులో పల్లెటూరి అమ్మాయి పాత్రలో లెనిన్ లో అద్భుతంగా కనిపించడంతో ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అఖిల్ తో సమానమైన స్క్రీన్ స్పేస్ అమ్మడుకి లెనిన్ లో దక్కినట్టుగానే కనిపిస్తుంది.

లెనిన్ టీజర్ కట్ లో, ట్రైలర్ కట్ అన్నిటిట్లో భాగ్యశ్రీ బోర్సే కి దర్శకుడు కావల్సినంత స్కోప్ ఇచ్చాడు. అమ్మడు పల్లెటూరి అందాలు గురించే ఇప్పుడు ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. లెనిన్ రిలీజ్ కి ముందే భాగ్యశ్రీ బోర్సే లెనిన్ ప్రమోషన్స్ లో గ్లామర్ గా కనిపిస్తే అమ్మడు పై మిగతా దర్శకుల కన్ను పడడం ఖాయం. 

Bhagyashri Borse