మాట మీదే ఉన్న అఖిల్
Akhil speech at Lenin Trailer launch
అఖిల్ అక్కినేని లెనిన్ తో మరో పది రోజుల్లో ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాడు. నిన్న సాయంత్రం వైజాగ్ లో అభిమానుల కోలాహలం మధ్యన లెనిన్ ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. లెనిన్ ట్రైలర్ కి అన్ని వైపుల నుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. లెనిన్ ట్రైలర్ యూత్ కి కూడా కనెక్ట్ అయ్యింది.
ఇక అఖిల్ ముందు నుంచి చెప్పిన మాట మీదే ఉన్నాడు. మేము కాదు సినిమా మాట్లాడుతుంది అని. నాగవంశీ ని అప్ డేట్స్ అడిగితే మా హీరో అఖిల్ హడావిడి చెయ్యొద్దు, మనం కాదు మాట్లాడేది సినిమా మాట్లాడాలి అని చెప్పారు. ఇప్పుడు లెనిన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లోను అఖిల్ అదే చెబుతున్నాడు.
మూడేళ్లయ్యింది మీ ముందుకు వచ్చి క్షమించండి.. నేను కాదు మాట్లాడేది సినిమా మాట్లాడుతుంది అంటూ మరోసారి లెనిన్ పై తనకు ఉన్న నమ్మకాన్ని అభిమానుల ముందు బయటపెట్టాడు. ముందు నుంచి లెనిన్ పై కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన లెనిన్ తో అఖిల్ ఈసారి గట్టిగా కొట్టాలని అభిమానులు మొక్కని దేవుడు లేడు.







































