హీరోయిన్ల ఎంట్రీతో ఐటం పాట‌లు కిల్ అవుతున్నాయా?

Movie Item Songs

ఇటీవల కాలంలో స్టార్ హీరోల చిత్రాలలో స్టార్ హీరోయిన్లు ప్రత్యేక గీతాల్లో మెరవడం పెద్ద ట్రెండ్‌గా మారింది. సినిమాకు అదనపు క్రేజ్ తీసుకురావడానికి.. ప్రమోషన్ల పరంగా హైప్ పెంచడానికి దర్శక,నిర్మాతలు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అయితే స్టార్ హీరోయిన్ల ఎంట్రీ  సోషల్ మీడియాలో కాసేపు హడావుడి చేయడానికి మాత్రమే పనికొస్తోంది.  థియేటర్లలో ప్రేక్షకులకు కావాల్సిన అసలైన కిక్ మాత్రం ఇవ్వలేకపోతోందనే విమ‌ర్శ  వ్య‌క్త‌మ‌వుతోంది. కేవలం గ్లామర్ జోడించడం వల్లే ఆ పాట మాస్ ఆడియన్స్‌కు పూర్తి స్థాయిలో రీచ్ కావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ అంటే వాటికి  ప్రత్యేకంగా స్పెషలిస్ట్ డాన్సర్లు ఉండేవారు. వారి బాడీ లాంగ్వేజ్, మాస్ ఎక్స్‌ప్రెషన్స్, నృత్య రీతులు థియేటర్లలోని సామాన్య ప్రేక్షకులను సైతం ఊపేసేవి. ఆ ప్రత్యేక నృత్యకారిణులు తెరపై కనిపిస్తే వచ్చే మాస్ అప్పీల్, ఆ పాటలో ఉండే వైబ్  భిన్నంగా ఉంటుంది. వారు కేవలం ఆ మూడు నాలుగు నిమిషాల పాట కోసమే  ప్రత్యేకమైన ఎనర్జీని తీసుకొస్తారు. కానీ ప్రస్తుత స్టార్ హీరోయిన్లు  ఇమేజ్ చట్రం దాటి అంతగా మాస్ కి కనెక్ట్ అయ్యేలా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వలేకపోతున్నారు. ఫలితంగా ఆ పాటలు సగటు గ్లామర్ సాంగ్స్‌గా మిగిలి పోతున్నాయి తప్ప ఐటమ్ సాంగ్స్ లో ఉండాల్సిన అసలైన ఘాటును కోల్పోతున్నాయి.

హీరోయిన్లు ఎంత అందంగా కనిపించినా? వారిపై ఉండే క్లాస్ ముద్ర లేదా రెగ్యులర్ పాత్రల ఇమేజ్ కారణంగా ఆ పాటలో ఉండాల్సిన కమర్షియల్ మాస్ కనెక్ట్ మిస్ అవుతోంది. పెద్ద హీరోయిన్ ప్రత్యేక గీతంలో నటిస్తే సినిమాకు బిజినెస్ పరంగా కలిసొచ్చినా? థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పరంగా ప్రేక్షకుడు ఆశించే జోష్ రావడం లేదు. అందుకే సినిమాల్లో స్టార్ ఇమేజ్ కోసం కాకుండా సదరు పాటకు న్యాయం చేసేలా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రత్యేక గుర్తింపు ఉన్న ఐటమ్ భామలను ఎంచుకుంటేనే ఆయా మాస్ నెంబర్లకు సరైన అందం, ఆడియన్స్‌తో బలమైన కనెక్షన్ ఏర్పడుతుందని మెజార్టీ వ‌ర్గా అభిప్రాయ‌ప‌డుతోంది.

Top Heroines