వీకెండ్ లో మా ఇంటి బంగారం హావా
Maa Inti Bangaaram Races To 43 Crore
గత శుక్రవారం విడుదలైన సమంత మా ఇంటి బంగారం చిత్రం బాక్సాఫీసు దగ్గర జోరు చూపిస్తుంది. థియేటర్స్ లో విడుదలైన మొదటి రోజు ఎబోవ్ యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ మా ఇంటి బంగారం చిత్రానికి లేడీ ఫ్యాన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవడంతో మా ఇంటి బంగారం కలెక్షన్స్ బాగా పెరిగాయి.
మా ఇంటి బంగారం ఫస్ట్ వీకెండ్ గడిచేసరికి రూ.43 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ వేసి ప్రకటించారు. మూడు రోజుల్లో రూ.43 కోట్లు కలెక్ట్ చెయ్యడం చూసి మళ్లీ దర్శకనిర్మాతల్లో లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ లపై ఇంట్రెస్ట్ కలిగినా కలగొచ్చు అనే టాక్ మొదలైంది.
మరోపక్క మా ఇంటి బంగారం సక్సెస్ అలాగే సమంత ప్రెగ్నెన్సీ రెండూ ఒకేసారి సమంత ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ లే అంటూ వారు సంబరాలు చేసుకుంటున్నారు.
Samantha Maa Inti Bangaaram Three Days Boxoffice Collections







































