కోర్టుకు హాజరు కాని అల్లు అర్జున్
Allu Arjun to skip Court hearing
పుష్ప 2 ప్రీమియర్స్ రోజున సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఈరోజు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవ్వాలని నాంపల్లి కోర్టు ఈ కేసులో A 11 గా ఉన్న అల్లు అర్జున్ కి కోర్టు నోటీసులు జారి చేసింది. కోర్టు నోటీసులు అందుకున్న అల్లు అర్జున్ తన లాయర్ తో తను ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం ముంబై లో ఉన్న కారణంగా కోర్టుకు హాజరవ్వలేను..
వర్చువల్ గా కోర్టు విచారణకు హాజరవుతాను అని అడగగా దానికి కోర్టు నిరాకరించింది. అయితే ఈరోజు సోమవారం అల్లు అర్జున్ కోర్టుకి రాలేదు. దానితో సంధ్య థియేటర్ కేసు విచారణను జులై 6 కి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు.
Allu Arjun to skip Nampally court hearing







































