ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Shanmukh Jashwanth got married to Vaishnavi

సైలెంట్ గా యూట్యూబర్ షణ్ముఖ్ వివాహం

Shanmukh Jashwanth got married to Vaishnavi


యూట్యూబ్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయ్యి సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టబోతున్న షణ్ముఖ్ జస్వంత్ తిరుమల తిరుపతి దేవస్థానంలో సైలెంట్ గా వైష్ణవి అనే అమ్మాయిని వివాహం చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. దీప్తి సునయన ను ప్రేమించి బిగ్ బాస్ కారణంగా ఆమె ప్రేమను వదులుకోవాల్సి వచ్చిన షణ్ముఖ్ ఆతర్వాత పలు కాంట్రవర్సీలకు నెలవుగా మారాడు.

ఇక మెల్లగా పనిలో పడి మరో అమ్మాయి వైష్ణవి ని ప్రేమించి నిచ్చితార్ధం చేసుకున్న షణ్ముఖ్.. ఆతర్వాత కొన్నాళ్ళకు కాబోయే భార్య తో కలిసి నూతన గృహ ప్రవేశం చెయ్యడంతో అప్పుడే షణ్ముఖ్-వైష్ణవిలు వివాహం చేసుకునే కొత్తింట్లోకి వెళ్ళారనుకున్నారు. కానీ తాజాగా షణ్ముఖ్ వివాహం తిరుమలలో జరిగింది.

తిరుమల వేంకటేశ్వరుడి సన్నిదిలో షణ్ముఖ్-వైష్ణవి ల వివాహం సైలెంట్ గానే అయినా గ్రాండ్ గా జరిగింది. తిరుమలలోనే షణ్ముఖ్-వైష్ణవుల హల్దీ సెర్మోనీ ని కుటుంబ సభ్యులు నిర్వహించడమే కాకుండా.. పెళ్లి కూడా అక్కడే జరిపించారు. షణ్ముఖ్ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటుగా కొద్దిమంది బంధువులు, సన్నిహిలు, స్నేహితులు హాజరైనట్టుగా తెలుస్తుంది.

Youtuber Shanmukh Jashwanth got married to Vaishnavi in Tirumal