NBK112 ముహూర్తం అప్ డేట్
Exciting update on NBK112
నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111 ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన పవర్ ఫుల్ గ్లింప్స్ ని బాలయ్య బర్త్ డే రోజు అభిమానులకు అందించారు గోపీచంద్ మలినేని. దానితో NBK 111 పై అంచనాలు భారీగాపెరిగాయి. ఆ చిత్ర షూటింగ్ నడుస్తుండగానే బాలయ్య మరో మూవీ సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అయ్యింది.
బాలయ్య తన తదుపరి ప్రాజెక్ట్ NBK 112 ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్రానికి సంబందించిన క్రేజీ అప్ డేట్ ని అఫీషియల్ గా వదిలారు. అది జూన్ 25 ఉదయం 9 గంటలకు శ్రీవెంకటేశ్వర స్వామి టెంపుల్ వెంకటపాలెంలో నారా లోకేష్, కందుల దుర్గేష్ లు ముఖ్య అతిధులుగా పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతున్నట్టుగా ప్రకటించారు.
ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో జూన్ 25 న మొదలైనప్పటికి రెగ్యులర్ షూటింగ్ కి మాత్రం కొద్దిగా సమయం పడుతుంది అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో బాలయ్య కు జోడిగా బాలీవుడ్ భామను తీసుకొచ్చే పనిలో కొరటాల ఉన్నట్లుగా సమాచారం.







































