పవన్ ని టార్గెట్ చేస్తే జైలే గతి
MLC Duvvada Srinivas to appear for police questioning today
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా వైసీపీ నుంచి గెంటివేయబడ్డ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. గత ఏడాది మార్చ్ లో పవన్ కల్యాణ్‌పై ఉద్దేశ్య పూర్వకంగా సోషల్ మీడియా వేదికగా.. దువ్వాడ శ్రీనివాస్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి.
దువ్వాడ పై జనసేన నాయకుడు పిన్నింటి చిన్నారావు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేశారు. ఆ కేసులోనే తాజాగా దువ్వాడ శ్రీనివాస్‌కు పోలీసులు నోటీసులు పంపారు. విచారణ నిమిత్తం జూన్ 22వ తేదీన అంటే ఈరోజు శ్రీకాకుళం జిల్లా హిరమండలం పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
వ్యక్తిగతంగా దువ్వాడ శ్రీనివాస్ కోర్టుకు హాజరు కావాలని అందులో స్పష్టం చేశారు. మరి ఈరోజు దువ్వాడ కోర్టుకు వెళతారా అనే విషయమై సస్పెన్స్ నడుస్తుంది. ఇక పవన్ అయినా, చంద్రబాబు ని అయినా అధికారంలో ఉన్నవారిని టార్గెట్ చేస్తే జైలే గతి అంటూ టీడీపీ, జనసేన కార్యకర్తలు కామెంట్లు చేస్తున్నారు.







































