టాలీవుడ్‌లో ఖరీదైన పోర్షే కార్ కొన్న హీరో
Tollywood hero who bought an expensive Porsche carటాలీవుడ్‌లో లగ్జరీ స్పోర్ట్స్ కార్లను మెయింటైన్ చేసే హీరోల జాబితా పెరుగుతోంది. ప్రస్తుతానికి అత్యంత ఖరీదైన.. రేస్-ట్రాక్ క్లాస్ పోర్షే కారును సొంతం చేసుకున్న హీరోగా అక్కినేని నాగచైతన్య హాట్ టాపిక్‌గా మారారు. టాలీవుడ్‌లో పోర్షే కార్లు కలిగిన టాప్- 5 స్టార్స్ కార్ల ధరలతో పోల్చి చూస్తే.. నాగచైతన్య లేటెస్ట్‌గా కొనుగోలు చేసిన పోర్షే 911 GT3 RS కారు ధర అత్యధికంగా ఉండటం విశేషం.
సాధారణంగా లగ్జరీ ఎస్‌యూవీల ధరలు ఒకటిన్నర నుండి రెండు కోట్ల లోపు ఉంటే.. చైతన్య ఏకంగా మూడున్నర కోట్ల రూపాయలకు పైగా భారీ మొత్తాన్ని కేవలం ఒక ప్యూర్ స్పోర్ట్స్ కార్ కోసం ఖర్చు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఒక వైల్డ్ రేసింగ్ కారును రోడ్డుపై నడిపేందుకు వీలుగా డిజైన్ చేసిన ఈ అల్ట్రా లగ్జరీ కారులో నాగచైతన్య, తన భార్య శోభితా ధూళిపాళతో కలిసి సిటీ రోడ్లపై షికారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మిగిలిన నలుగురు స్టార్ హీరోల పోర్షే కార్లతో పోలిస్తే చైతన్య కారు ధర... దానికున్న అడ్వాన్స్‌డ్ ఎయిరో డైనమిక్స్ ఫీచర్లు పూర్తిగా నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి.
అసలైన మోటార్ లవర్ గా పేరున్న నాగచైతన్య.. కేవలం బ్రాండ్ కోసమే కాకుండా స్పీడ్, పెర్ఫార్మెన్స్‌పై ఉన్న విపరీతమైన ప్యాషన్‌తోనే ఇంత పెద్ద మొత్తాన్ని వెచ్చించి ఈ రేర్ జర్మన్ లగ్జరీ కార్‌ను తన గ్యారేజీకి చేర్చారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.







































