ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bollywood hero sets remuneration record

పారితోషికంలో బాలీవుడ్ హీరో రికార్డ్

Bollywood hero sets remuneration record


సౌత్ లోనే కాదు నార్త్ లోను అందరికన్నా అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు ఎవరు అంటే సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు వినిపిస్తుంది. ఆతర్వాత చాలామంది హీరోలు లైన్ లోకి వచ్చారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో ఒకరు ఈ పారితోషికం విషయం లో రికార్డ్ క్రియేట్ చేసారు.

ఆయనే ధురంధర్ సీరీస్ తో టాప్ పొజిషన్ కు వెళ్లిన రణ్వీర్ సింగ్. రణ్వీర్ సింగ్ ధురంధర్ చిత్రానికి గాను రూ.325 కోట్ల పారితోషికం అందుకున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. అయితే అది నిర్మాతల నుంచి పారితోషికం రూపంలో రణ్వీర్ తీసుకోలేదట ధురంధర్ లాభాల్లో రణ్వీర్ కు వచ్చిన వాటా రూ.325 కోట్లని తెలుస్తుంది.

ధురంధర్ రెండు భాగాలుగా తెరకెక్కి వరల్డ్ వైడ్ గా రూ.3,200 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం అనుకున్నప్పుడు రణ్వీర్ సింగ్ ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ధురంధర్ లాభాల్లో వాటా తీసుకునే ఒప్పందం చేసుకున్నారట. అంతేకాకుండా ధురంధర్ బడ్జెట్ చేయిదాటిపోయిన సమయంలో రణ్వీర్ కూడా ధురంధర్ కోసం కొంత అమౌంట్ పెట్టడంతో ఆయన వాటికి ఎక్కువ షేర్ వచ్చింది అని తెలుస్తుంది.

ధురంధర్ థియేట్రికల్ రైట్స్, డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ నుంచి వచ్చిన ఆదాయంలో రణ్వీర్ సింగ్ వాటా కింద రూ.325 కోట్లు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక రణ్వీర్ కన్నా ఎక్కువగా లాభాల్లో వాటా జీ స్టూడియోస్ తో పాటుగా ఆదిత్యధర్ నిర్మాణ సంస్థ తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

Ranveer Singh has reportedly emerged as India's highest remuneration