Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ram Charan to take three month acting break after Peddi

సుక్కు ఇంకాస్త వెయిట్ చెయ్యాల్సిందే !

Ram Charan to take three month acting break after Peddi


పుష్ప 2 తర్వాత మరే కమిట్మెంట్ పెట్టుకోకుండా  రామ్ చరణ్ తొ చెయ్యబోయే ప్రాజెక్ట్ కోసమే వెయిట్ చేస్తున్న సుకుమార్ కు ఇప్పుడు కూడా వెయిటింగ్ తప్పేలా  లేదు. రామ్ చరణ్ పెద్ది తర్వాత సుకుమార్ తో చెయ్యబోయే RC 17 ప్రాజెక్ట్ లోకి వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పుడు రామ్ చరణ్ ఇమ్మిడియట్ గా సుక్కు ప్రాజెక్ట్ లోకి వెళ్లేలా  కనిపించడం లేదు.

పెద్ది షూట్ లో జరిగిన చిన్న చిన్న యాక్సిడెంట్లకు రామ్ చరణ్ ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంది. అంటే చేతికి సర్జరీ తో పాటుగా రామ్ చరణ్ ఫ్యామిలీ తో కాస్త టైమ్ స్పెండ్ చేసి ఆతర్వాతే రామ్ చరణ్ సుక్కు ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవుతారని తెలుస్తుంది. ఈ ఏడాది చివరలో ఏమైనా సుక్కు-చరణ్ ప్రాజెక్ట్ సెట్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

చరణ్ రెస్ట్ సమయంలో సుక్కు స్క్రిప్ట్ వర్క్ అలాగే మిగతా నటులు, హీరోయిన్ ని ఫైనల్ చేసుకుని ప్రోపర్ గా చరణ్ తో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అంటే వచ్చేఏడాది చెర్రీ ఆడియన్స్ కి కనిపించరని తెలుస్తుంది. 2028 లో చెర్రీ-సుక్కు ప్రాజెక్ట్ తెరపై కనిపిస్తుందన్నమాట.

RC 17 update