ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Peddi OTT Version To Be 3 Hours 25 Minutes Long

పెద్ది - ఓటీటీ ఆడియన్స్ పండగే

Peddi OTT Version To Be 3 Hours 25 Minutes LongPeddi OTT Version To Be 3 Hours 25 Minutes Long


రామ్ చరణ్ లేటెస్ట్ చిత్రం పెద్ది. థియేటర్స్ లో గత గురువారం విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించినా అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టిన పెద్ది చిత్రంపై పలు విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా జాన్వీ కపూర్ ఎపిసోడ్స్, ఆమె గ్లామర్ షో పై విమర్శలు వెల్లువెత్తాయి.

దానితో దర్శకుడు బుచ్చిబాబు జాన్వీ కపూర్ కి సంబందించిన కొన్నివేశాలను తొలగించడంతో థియేట్రికల్ పెద్ది వెర్షన్ లో కాస్త రన్ టైమ్ తగ్గింది. దానితో మెగా ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయినా.. ఓటీటీ పెద్ది వెర్షన్ కి మాత్రం కొన్ని సన్నివేశాలు జోడిస్తున్నారట బుచ్చిబాబు.

త్వరలో నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ లోకి రాబోయే పెద్ది ఓటీటీ వెర్షన్ లో రామ్ చ‌ర‌ణ్-జ‌గ‌ప‌తిబాబు అనుబంధాన్ని ఎలివేట్ చేస్తూ తీసిన కొన్ని సీన్లు యాడ్ చేస్తున్నాడట బుచ్చిబాబు. పెద్ది థియేట్రికల్ రిలీజ్ కి ముందే సినిమా లెంగ్త్ ఎంతున్నా ఫర్వాలేదు. ఎమోష‌న్ క్యారీ చేసే స‌న్నివేశాల్ని తొల‌గించ‌కూడ‌దు అని జగపతి బాబు.. బుచ్చిబాబుకి చెప్పాడ‌ట‌. కానీ అప్ప‌టికే సినిమా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు వాటిని ఓటీటీ కోసం క‌ల‌ప‌బోతున్నారు.

అలాగే శివరాజ్ కుమార్-చరణ్ కి సంబందించిన కొన్ని సీన్స్ ని కూడా ఓటీటీ కోసం కలపబోతున్నారట. ఓ 20 నిమిషాల ఫుటేజీ ఓటీటీ కోసం యాడ్ చేస్తున్నారట. ఆ కొత్త ఫుటేజ్ ని థియేట‌ర్లో చూసిన ప్రేక్ష‌కులు కూడా నెట్ ఫ్లిక్స్ నుంచి ఓటీటీలోకి వ‌చ్చాక మ‌ళ్లీ చూస్తారు. సో పెద్ది ఓటీటీ ఆడియన్స్ కి పండగే అన్నమాట. 
 

Peddi OTT Version