Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Varalaxmi Sarathkumar Faces Allegations of Non-Cooperation

తనపై వస్తున్న ఆరోపణలపై రియాక్ట్ అయిన హీరోయిన్

Varalaxmi Sarathkumar Faces Allegations of Non-Cooperation

 

వరలక్ష్మి శరత్ కుమార్ సినిమా ప్రమోషన్స్ కోసం డబ్బు తీసుకుని ప్రమోషన్స్ కి రావడం లేదు, అలాగే డబ్బింగ్ చెప్పే విషయంలోనూ ఆమె తమను బాగా ఇబ్బంది పెట్టింది, డబ్బు తీసుకుని ఇంటర్వూస్ ఇవ్వలేదు అంటూ పోలీస్ కంప్లైంట్ దర్శకుడు సంజీవ్ మేగోటి చేసిన సంచలన ఆరోపణలపై నటి వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యింది.

ఈ వివాదాన్ని పెద్దది చెయ్యడం ఇష్టం లేదు అంటూనే.. నేను ఎప్పుడు కావాలన్నా పోలీస్ కంప్లైంట్ టీమ్ కి అందుబాటులో ఉన్నాను. అసలు ఆ దర్శకుడు ఏం మట్లాడారో నాకు తెలియదు. నాకు ఇంతకుమించి మాట్లాడడం ఇష్టం లేదు. ఆ సినిమాకి సంబందించిన ప్రతి ఈవెంట్ లోను నేను పాల్గొన్నాను. కొన్ని విషయాల్లో నాకంటూ సొంత అభిప్రాయాలను ఉన్నాయి.

అందుకే మూవీ యూనిట్ చేస్తున్న ఆరోపణలపై నేను ఓపెన్ గా మాట్లాడాలనుకోవడం లేదు. నా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంటూ పోలీస్ కంప్లైంట్ వివాదం పై వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియా వేదికగా నోట్ లో రాసుకొచ్చింది. 
 

Sanjeev Megoti went on record against actress Varalaxmi Sarathkumar