Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Balayya Vivek Athreya Film Is On Track

ఆ ఇద్దరూ బాలయ్యకు టచ్ లోనే ఉన్నారు

Balayya Vivek Athreya Film Is On Track


నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న NBK 111 తర్వాత విజయ్ కనకమేడల, వివేక్ ఆత్రేయ ల దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నారనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఆతర్వాత సడన్ గా బాలయ్య లైన్ లోకి కొరటాల శివ ఎంటర్ అయ్యారు. దానితో బాలయ్య-వివేక్ ఆత్రేయ సినిమా ఆగిపోయింది అనే వార్తలు నడిచాయి.

కానీ బాలయ్య తో వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల టచ్ లో ఉన్నారు. అదే విషయాన్ని బాలయ్య బర్త్ డే రోజునే కన్ ఫర్మ్ చేసారు. జూన్ 10 న బాలయ్య బర్త్ డే సందర్భంగా వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల విడివిడిగా తమ తమ నిర్మాతలతో కలిసి బాలయ్యకి విషెస్ చెప్పి పూల బొకే ఇచ్చి వచ్చారు.

సో బాలయ్య లైనప్ లో ఈ యంగ్ డైరెక్టర్స్ ఇద్దరూ ఉన్నారు. వారి కాంబో లు ఆగిపోలేదు. కాకపోతే కాస్త లేట్ అవుతుంది. ప్రస్తుతం NBK 111 చేస్తున్న బాలయ్య తర్వాత కొరటాల మూవీ స్టార్ట్ చేస్తారు. ఆతర్వాత విజయ్ కనకమేడల, వివేక్ ఆత్రేయ ఫిలిమ్స్ లోకి ఎంటర్ అవుతారని తెలుస్తుంది. 
 

Balakrishna Upcoming Movies with Vivek Athreya and Vijay Kanakamedala