Advertisement

ట్రైల‌ర్‌: జంగిల్‌లో అక్ష‌య్ గ్యాంగ్ హంగామా

The Jungle trailer review

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన మోస్ట్ అవైటెడ్ కామెడీ ఎంటర్‌టైనర్ వెల్‌కమ్ టు ది జంగిల్(వెల్‌కం 3) ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో, ఫిరోజ్ ఎ. నాడియాడ్‌వాలా నిర్మాణంలో తెరకెక్కిన ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం జూన్ 26న థియేటర్లలో విడుదల కానుంది. దాదాపు 4 నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఒక నకిలీ (ఫేక్) సినిమా సెట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే జంగిల్ అడ్వెంచర్ .. గందరగోళ కామెడీతో ఆకట్టుకుంది. ఈ చిత్రంతో అక్షయ్ కుమార్ చాలా కాలం తర్వాత మళ్లీ వెల్‌కమ్ ఫ్రాంచైజీలోకి అడుగుపెట్టడం విశేషం.

ఈ సినిమాలో బాలీవుడ్‌కు చెందిన భారీ నటీనటుల బృందం సందడి చేయబోతోంది. ట్రైలర్‌లో పరేష్ రావల్ దర్శకుడిగా కనిపించగా.. సునీల్ శెట్టి, రవీనా టాండన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దిశా పటాని, లారా దత్తా, అర్షద్ వార్సి, జానీ లీవర్, రాజ్‌పాల్ యాదవ్ వంటి ఎందరో ప్రముఖులు తమ కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు.

అంతేకాకుండా విలన్ పాత్రలో ఎంట్రీ ఇచ్చిన జాకీ ష్రాఫ్ అడిగిన ప్రశ్నకు.. అక్షయ్ కుమార్ తన నిజ జీవిత బాక్సాఫీస్ పరాజయాలపై (ఫ్లాప్స్‌) స్వయంగా సెల్ఫ్ సెటైర్ వేసుకోవడం.. గత భాగంలోని మజ్ను భాయ్ పెయింటింగ్ మళ్లీ ప్రత్యక్షమవ్వడం వంటి వినోదాత్మక అంశాలు ఈ ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
 

The Jungle trailer out