గూఢచారి పాత్రలో పవన్ కళ్యాణ్‌ను చూడగలమా?
Pawan Kalyan revealed that he likes horror cinemaప్రస్తుతం స్పై థ్రిల్లర్స్, హై-ఇంటెన్సిటీ దేశభక్తి కథల ట్రెండ్ నడుస్తోంది. అగ్ర హీరోలంతా జాతీయ భద్రత, గూఢచార నేపథ్యమున్న పాత్రల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనసులో కూడా పవర్ ఫుల్ స్పై సినిమా చేయాలనే ఆలోచన ఉందా అనే చర్చ ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో స్టైలిష్ యాక్షన్ చిత్రాలు ఎన్నో ఉన్నా? పూర్తి స్థాయి రా ఏజెంట్ లేదా దేశభక్తి పూరిత గూఢచారి పాత్రలో ఇప్పటి వరకు నటించలేదు. పవన్ కి ఉన్న అసాధారణ మాస్ ఇమేజ్, పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ దృష్ట్యా ఆయన స్పై పాత్రను ఎంచుకుంటే? అది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమనే భావన ఇండస్ట్రీలో వ్యక్తమవుతోంది.
గతంలో పవన్ కళ్యాణ్ నటించిన `బాలు`, `పంజా` వంటి చిత్రాలలో అండర్ కవర్ ఆపరేషన్లు, యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ అవి పూర్తి స్థాయి స్పై డ్రామాలు కావు. అయితే పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో దేశభక్తిని, సామాజిక బాధ్యతను అమితంగా ఇష్టపడతారనే విషయం అందరికీ తెలిసిందే. దేశభక్తి , జాతీయ ప్రయోజనాల చుట్టూ తిరిగే స్పై కథలు ఆయన వ్యక్తిత్వానికి సమాజంలో ఆయనకున్న ఇమేజ్‌కు పర్‌ఫెక్ట్‌గా సరిపోతాయి. అందుకే కేవలం రొటీన్ కమర్షియల్ సినిమాల కంటే దేశం కోసం పోరాడే ఒక అజ్ఞాత వీరుడి పాత్రను వెండితెరపై ఆవిష్కరించాలనే బలమైన ఆలోచన ఆయన మనసులో ఉందని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేయలేదు. ఓజీ, హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింత్ చిత్రిఆలను బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ చేయడంతో ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డితో కమిట్ మెంట్ ఉంది. కానీ ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఈ సినిమా ఎలాంటి జానర్ కి చెందింది? అన్నది ఇంకా బయటకు రాలేదు. సూరి కూడా అప్పుడప్పుడు ఊహించని ప్రయోగాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో పీకే తో సూరి స్పై జానర్ లో చేసినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.








































