ప్రభాస్ తో ఆ దర్శకుడు సాధ్యమయ్యేనా?

Prabhas-Aditya Dhar combo updatePrabhas-Aditya Dhar combo update

 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస లైనప్ తో క్రేజీగా కనిపిస్తున్నారు. క్రేజీ దర్శకులతో ప్రభాస్ క్షణం తీరిక లేని షెడ్యూల్స్ తో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ చిత్రాలతో పాటుగా రేపోమాపో కల్కి 2 సెట్స్ లోకి ప్రభాస్ జాయిన్ అవ్వాల్సి ఉంది. తరవాత సలార్ 2 ఉండనే ఉంది.

అయితే బాలీవుడ్ లో ధురంధర్ పార్ట్ 1, పార్ట్ తో సెన్సేషన్ సృష్టించిన ఆదిత్య ధర నెక్స్ట్ మూవీపై ఎడతెగని చర్చ జరుగుతుంది. అందులోను ప్రభాస్ తో ఆదిత్య ధర్ నెక్స్ట్ మూవీ  ఎప్పటినుంచో వైరల్ అవుతుంది. ఆదిత్య ధర్ - ప్రభాస్ మీట్ అయ్యారు. వారిద్దరూ ఏవేవో షేర్ చేసుకున్నారు. దానితో ఆ కాంబో సెట్ అన్నారు.

అయితే ఆదిత్య ధర్ నెక్స్ట్ జియో స్టూడియోస్ లో సినిమా చెయ్యాల్సి ఉంది. అందులో హీరో ఎవరు, ఎలాంటి సబ్జెక్టు తో ఆదిత్య ధర్ మళ్ళీ ఆడియన్స్ ని మాయ చేస్తారో తెలియదు కానీ.. ప్రభాస్ తో ఆదిత్య ధర్ మూవీ అనేది ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు. ప్రభాస్ లైనప్ ఇప్పట్లో కదిలించడానికి లేదు. సో ప్రభాస్-ఆదిత్య ధర్ ఎప్పుడు కలిసి సినిమా చేస్తారు అనేది మాత్రం సాధ్యమవ్వదు. 

Prabhas-Aditya Dhar combo news