సూపర్ స్టార్ తిట్టారా.. పొగిడారా

విజయ్ సీఎం అయ్యాక సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం, అదే సమయంలో మాజీ సీఎం స్టాలిన్ ని కలవడం పై సోషల్ మీడియాలో రజిని పై పలు విమర్శలు వినిపించాయి. తను రాజకీయాల్లోకి రాలేకపోయాను అని, ఫస్ట్ టైం పోటీ చేసి సీఎం గా గెలిచిన విజయ్ ని చూసి రజినీకాంత్ అసూయ పడుతున్నారంటూ చాలానే వినిపించాయి.
అయితే తనపై వస్తున్న విమర్శలకు సూపర్ స్టార్ ఈరోజు మీడియా ముందు చెక్ పెట్టారు. విజయ్ సీఎం అయితే తనకెలాంటి అసూయ, ద్వేషం లేదు. అతను సీఎం అవడం నాకు సంతొషమే అని చెప్పిన రజినీకాంత్.. విజయ్ సీఎం అయ్యాడని తెలిసి తాను ఆశ్చర్యపోయాను అన్నారు.
ఎంజీఆర్ కూడా సాధించలేనిది విజయ్ సాధించాడు, తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారు అంటూనే సూపర్ స్టార్.. తనకు విజయ్ సమఉజ్జి కాదు అంటూ చేసిన కామెంట్స్ చూసిన వారు అసలు ప్రెస్ మీట్ పెట్టి సూపర్ స్టార్ రజినీకాంత్ విజయ్ ని పొగిడారా, లేదంటే తిట్టారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.






































