ఓటీటీ కి వచ్చేస్తున్న సత్య జెట్ లీ

కమెడియన్ సత్య మెయిన్ లీడ్ లో తెరకెక్కిన జెట్ లీ చిత్రం విడుదలకు ముందు మంచి అంచనాలు కనిపించాయి. సత్య కామెడీ ప్రమోషన్స్ అందరిలో జెట్ లీ చూడాలనే ఆసక్తి క్రియేట్ అయ్యేలా చేసాయి. రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన ఈచిత్రం మే 1 న థియేటర్స్ లో విడుదలై డిజప్పాయింట్ చేసింది.
ప్రమోషన్స్ లో కనిపించిన కంటెంట్ సినిమాలో లేకపోయేసరికి ప్రేక్షకులు నిరాశపడిపోయారు. ఇప్పుడు ఈ చిత్రం షాకింగ్ గా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. సత్య జెట్ లీ చిత్ర ఓటీటీ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది.
మే 1 న థియేటర్స్ లో విడుదలైన జెట్ లీ చిత్రాన్ని మూడు వారాలు తిరిగేసరికి ఓటీటీ బాట పట్టింది. మే 25 నుంచి ఈ చిత్రం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ చిత్రం కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే అందుబాటులోకి రానుందని సమాచారం.






































