పాక్ లో దుమ్మురేపుతున్న ధురంధర 2

ఆదిత్య ధర్ పాకిస్తాన్ కరాచీ లోని లయరీ ప్రాంతాన్ని కీలకంగా చూపిస్తూ రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ధురంధర్, ధురంధర్ 2 రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు ధురంధర్ 2 విడుదలయ్యాక పాకిస్తాన్ అయితే ఇండియన్ సీక్రెట్ ఏజెంట్స్ విషయంలో వణికిపోయింది.
అయితే అప్పట్లోనే ధురంధర్ 2 పైరసీ వెర్షన్ ని వీక్షించిన పాకిస్తానీయులు ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ నుంచి విదేశాల్లో స్ట్రీమింగ్ లోకి వచ్చిన ధురంధర్ ద రివెంజ్ చిత్రాన్ని విపరీతంగా వీక్షించడం హైలెట్ అయ్యింది. ధురంధర్ 2 నెట్ ఫ్లిక్స్ లోకి రాగానే ఓటీటీ సర్వర్ క్రాష్ అయిందని...
అంతేకాకుండా ఓటీటీ లో స్ట్రీమింగ్ లోకి వచ్చిన 24 గంటల నుంచి తమ దేశంలో నం.1 ట్రెండింగ్ లో ధురంధర్ 2 నిలిచింది అంటూ పాక్ ఇన్ఫ్లూయెన్సర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి ఓటీటీ సర్వర్ క్రాష్ అయ్యేలా పాకిస్తానీయులు ధురంధర్ 2 ని వీక్షించారు అంటే మాములు విషయం కాదు.
తమ లయరీ ఏరియాలో గ్యాంగ్ వార్స్, ఇండియా రా ఏజెంట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వీక్షించేందుకు పాకిస్తానీయులు ఎంతగా వెయిట్ చేసారో అనేది ఇది చూస్తేనే తెలుస్తుంది.






































