ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kamal Haasan Key Comments on Rajinikanth

రజినీకి నాకు పోటీ ఉంది కానీ అసూయ లేదు - కమల్

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా సీఎం విజయ్ గురించి ప్రెస్ మీట్ పెట్టి మొదటిసారి మాట్లాడారు. విజయ్ సీఎం అవడం నాకు సంతోషమే. ఆయన్ని సీఎం అవ్వకుండా నేను అడ్డుపడలేదు. నేను ఎలాంటి రాజకీయాలు చెయ్యలేదు, అయినా విజయ్ నాకు సమఉజ్జి కాదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. విజయ్ సీఎం అవడం పట్ల తనకెలాంటి ఇబ్బంది లేదు అని తేల్చి చెప్పారు.

అయితే సూపర్ స్టార్ వ్యాఖ్యలపై కమల్ హాసన్ స్పందిస్తూ రజిని నేను మంచి స్నేహితులం. మా మధ్యన పోటీ ఉంటుంది కానీ అసూయ లేదు. మేము సినిమాల్లో నటించకపోయినా, వేరే ఫీల్డ్ లో ఉన్నా ఇలానే ఉంటాము. ఇక సీఎం గా విజయ్ ఎలా పాలిస్తున్నాడు అని అడిగితే రెండు రోజులకే ఏం చెప్పగలుగుతాం.

కొత్త వాళ్ళను తక్కువగా చూడకూడదు. విజయ్ పాలన తెలుసుకోవాలంటే ఆరు నెలలు సమయం ఇవ్వాలి. ఈ ఆరు నెలలు విజయ్ పాలనపై మీడియా క్లోజ్ గా మోనిటరింగ్ చెయ్యాలి అంటూ కమల్ హాసన్ రజిని ప్రెస్ మీట్ పై అలాగే సీఎం విజయ్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

Kamal Haasan,Kamal Haasan Key Comments on Rajinikanth