రాకా - అల్లు ఫ్యాన్స్ కి టెన్షన్ అక్కర్లేదు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ తో చేస్తున్న రాకా చిత్రానికి రిలీజ్ డేట్ లాక్ చేయకపోవడంతో.. ఈ చిత్రం ఈ ఏడాది రాకపోయినా 2027 లో వస్తుందా అనే అనుమానం అల్లు ఫ్యాన్స్ లో ఉంది. అయితే అల్లు ఫ్యాన్స్ కు మాత్రం ఈ విషయంలో ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు. కారణం దీపికా పదుకొనె ప్రెగ్నెంట్.
ఆమె ప్రెగ్నెంట్ కావడంతో అట్లీ అల్లు అర్జున్ - దీపికా నడుమ ఉండే సన్నివేశాలను, అలాగే దీపికా పదుకొనె పై కీలక సన్నివేశాలను చాలా త్వరగా షూట్ చేస్తున్నారు. దీనిని బట్టి అల్లు అర్జున్-అట్లీ రాకా షూటింగ్ చాలా త్వరగానే ఫినిష్ అవుతుంది. అందుకు అనుగుణంగానే అట్లీ రాకా రిలీజ్ డేట్ లాక్ చేస్తారు.
సో అల్లు ఫ్యాన్స్ రాకా విడుదల విషయంలో ఎలాంటి టెన్షన్ పెట్టుకోవక్కర్లేదు. దీపికా ఇప్పటికే షారుక్ తో చేస్తున్న కింగ్ షూటింగ్ ఫినిష్ చేసేసింది. దీనిని బట్టి అల్లు అర్జున్ రాకా ని కూడా దీపికా పదుకొనె త్వరలోనే ఫినిష్ చేసేస్తుంది.






































