మెగా 158 కి చిరు పవర్ ఫుల్ ముహూర్తం

మన శంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకుని మెగాస్టార్ చిరు దర్శకుడు బాబీ తో మెగా 158 చిత్రాన్ని మొదలు పెట్టాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో సినిమా పూజా కార్యక్రమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. ఇప్పుడు మెగా 158 చిత్ర పూజా కార్యక్రమానికి చిరు పవర్ ఫుల్ వీడియో తో ముహూర్తం పెట్టేసారు.
దర్శకుడు బాబీ తో చెయ్యబోయే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కోసం జిమ్ లో కఠినమైన వర్కౌట్స్ చేస్తూ చిరంజీవి.. మరోమారు ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ.. మెగా 158 మే 21 పూజ కార్యక్రమాలతో మొదలు కాబోతున్నట్టుగా.. మరో నాలుగు రోజుల్లో కలుసుకుందాం అంటూ వీడియో షేర్ చేసారు.
Every day is another opportunity to push beyond limits…
Charged up and excited for another memorable journey with my dear @dirbobby for #Mega158 🤗
Opening Ceremony on May 21st ✨
#ChiruBobby2
@KvnProductions అంటూ వీడియో షేర్ చేసారు. ఈ చిత్రంలో చిరు కి జోడిగా ప్రియమణి నటిస్తుండగా.. ఆయన కుమార్తె పాత్రలో అనశ్వర రాజన్ నటిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది.






































