Advertisement

ట‌క్ జ‌గ‌దీష్‌లో కోలో కోల‌న్న కోలో సాంగ్

Sat 13th Mar 2021 12:37 PM
nani,shiva nirvana,shine screens,tuck jagadish movie,tuck jagadish 2nd song,kolo kolanna kolo lyrical video  ట‌క్ జ‌గ‌దీష్‌లో కోలో కోల‌న్న కోలో సాంగ్
Tuck Jagadish 2nd Song Kolo Kolanna Kolo Lyrical Video Out ట‌క్ జ‌గ‌దీష్‌లో కోలో కోల‌న్న కోలో సాంగ్
Advertisement

నాని, శివ నిర్వాణ‌, షైన్ స్క్రీన్స్ ట‌క్ జ‌గ‌దీష్‌లోని రెండో పాట కోలో కోల‌న్న కోలో లిరిక‌ల్ వీడియో విడుద‌ల‌

నేచురల్ స్టార్ నాని  హీరోగా నటించిన టక్ జగదీష్ 2021లో ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. నిన్నుకోరి వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల  క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

టాప్ ఫామ్‌లో ఉన్న ఎస్‌. త‌మ‌న్ సినిమాలో సంద‌ర్భానుసారం వ‌చ్చే ఒక పాట‌కు చ‌క్క‌ని మెలోడీ ట్యూన్స్ స‌మ‌కూర్చారు. కోలో కోల‌న్న కోలో కొమ్మ‌లు కిల‌కిల న‌వ్వాలి..అంటూ ప్ర‌సిద్ధ గేయ‌ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాసిన ఈ మోటివేష‌న‌ల్ సాంగ్‌ను అర్మాన్ మాలిక్‌, హ‌రిణి ఇవ్వ‌టూరి, శ్రీ‌కృష్ణ‌, త‌మ‌న్ క‌లిసి ఆల‌పించారు. నాని ఫ్యామిలీపై ఈ పాట‌ను చిత్రీక‌రించారు. కుటుంబ అనుబంధాల‌ను తెలియ‌జేస్తూ, చిన్న‌నాటి కేరింత‌ల్ని గుర్తుచేస్తూ, హీరోను మోటివేట్ చేస్తూ ఆయ‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఈ పాట‌ను ఆల‌పిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

చ‌క్క‌ని సాహిత్య విలువ‌ల‌తో, సంగీత వాయిద్యాల‌న్నీ చెవుల‌కు ఇంపుగా వినిపిస్తూ మ‌ళ్లీ మ‌ళ్లీ పాడుకొనే రీతిలో ఈ పాట ఉంది. ఆ న‌లుగు‌రితో చెలిమి పంచుకో చిరున‌గ‌వు సిరులు పెంచుకో.. జ‌డివానే ప‌డుతున్నా జ‌డిసేనా త‌డిసేనా నీ పెద‌వుల‌పై చిరున‌వ్వులు ఎపుడైనా.. లాంటి లైన్లు సీతారామ‌శాస్త్రి గారికి కాకుండా ఎవ‌రికి సాధ్య‌మ‌వుతాయి! ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్ర‌ఫీతో దృశ్య‌ప‌రంగా ఈ పాట క‌న్నుల‌పంట‌గా ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహ‌మూ లేదు.  

ఈ పాట‌లో నానితో పాటు ఆయ‌న‌ తండ్రిగా న‌టిస్తోన్న నాజ‌ర్‌, అన్న‌గా న‌టిస్తోన్న జ‌గ‌ప‌తిబాబు, హీరోయిన్లు రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్, ఫ్యామిలీ మెంబ‌ర్స్ అయిన రావు ర‌మేష్‌, రోహిణి, దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు క‌నిపిస్తున్నారు.

నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని  షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఏప్రిల్ 23న ట‌క్ జ‌గ‌దీష్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న‌ది.

Tuck Jagadish 2nd Song Kolo Kolanna Kolo Lyrical Video Out:

Nani, Shiva Nirvana, Shine Screens Tuck Jagadish 2nd Song Kolo Kolanna Kolo Lyrical Video Out

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement