రాజుగారి రెండో పెళ్లి ఈ అమ్మాయితోనేనా!?

Tue 18th Feb 2020 03:33 PM
dil raju,second marriage,producer dil raju,marriage  రాజుగారి రెండో పెళ్లి ఈ అమ్మాయితోనేనా!?
News About Dil Raju Second Marriage.. Details Here! రాజుగారి రెండో పెళ్లి ఈ అమ్మాయితోనేనా!?
Sponsored links

టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. భార్య అనిత మృతి చెందిన అనంతరం మదనపడుతున్న ఆయనకు.. మరో పెళ్లి చేసుకోవాలని బంధువులు చెప్పారని.. కుమార్తె గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాజుగారు రెండోసారి ఓ ఇంటివాడవుతాడని కూడా వార్తలు గుప్పుమన్నాయ్. అయితే అటు ఇండస్ట్రీలో.. ఇటు వెబ్‌సైట్లలో వార్తలు కోడై కూస్తున్న ఇంతవరకూ దిల్‌రాజు స్పందించకపోవడంతో నిప్పు లేనిదే పొగరాదన్నట్లుగా.. మౌనానికి అర్థం అంగీకారమే అని కూడా పుకార్లు షికార్లు చేశాయ్. అయితే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగుచూసింది. అదేమిటంటే.. రాజుగారు పెళ్లి చేసుకోబోయేది ఈమెనే అంటూ మళ్లీ టాక్ నడుస్తోంది. 

దిల్ రాజు చేసుకోబోయే అమ్మాయి ఆయనకు చాలా కాలంగా తెలుసట. గతంలో ఎయిర్ హోస్టెస్‌గా పని చేసిందట. అంతేకాదు.. వీరిద్దరి మధ్య చాలా కాలంగా మంచి స్నేహబంధం కూడా ఉందట. అంతేకాదు.. ఆమె కూడా దిల్‌రాజుతో పెళ్లి అనే సరికి ముచ్చటపడిపోయిందట. ఆమెకు 30 ఏళ్లు వయసు కాగా.. దిల్ రాజు‌కు 50 ఏళ్లు నిండాయ్. అయినప్పటికీ రాజుగారేం అంత వయసు ఉన్నోడిగా కనిపించరు.. నిన్న మొన్నటి వరకూ పెళ్లి పెళ్లి అని వార్తలు రాగా.. ఇప్పుడు ఏకంగా ఇలా పూర్తి వివరాలు కూడా వచ్చేశాయ్.. ఇప్పుడైనా దిల్‌రాజు స్పందించి క్లారిటీ ఇస్తాడో లేకుంటే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే డైరెక్టుగా చెప్పేస్తాడో వేచి చూడాల్సిందే మరి.

Sponsored links

News About Dil Raju Second Marriage.. Details Here!:

News About Dil Raju Second Marriage.. Details Here!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019