టెంప్ట్ ర‌వి ‘వైఫ్‌,ఐ’ షూటింగ్ పూర్తయింది

Fri 19th Jul 2019 08:06 PM
tempt ravi wife i,yedu chepala katha,shooting completed  టెంప్ట్ ర‌వి ‘వైఫ్‌,ఐ’ షూటింగ్ పూర్తయింది
Tempt Ravi Wife, I Movie Shooting Completed టెంప్ట్ ర‌వి ‘వైఫ్‌,ఐ’ షూటింగ్ పూర్తయింది

ఇటీవ‌ల యూట్యూబ్‌లో టీజ‌ర్ తోనే సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన ఏడుచేప‌ల క‌థ లో టెంప్ట్ రవి గా దూసుకుపోయిన అభిషేక్ రెడ్డి, సాక్షి నిదియా జంట‌గా,  జి.చ‌రితా రెడ్డి నిర్మాతగా ల‌క్ష్మీ చ‌రిత ఆర్ట్స్ మ‌రియు జిఎస్ఎస్‌పికె స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో రేష్మి హీరోయిన్‌గా అంతం అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జి.ఎస్‌.ఎస్‌.పి.క‌ళ్యాణ్ ద‌ర్శ‌కుడిగా నిర్మిస్తున్న ఈచిత్రానికి ‘వైఫ్,ఐ’ అనే టైటిల్‌ని ఖ‌రారు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఈ చిత్రానికి నైఫ్ బెట‌ర్ దెన్ వైఫ్ అనే క్యాప్ష‌న్‌ని పెట్టారు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్‌ని ఇటీవ‌లే విడుద‌ల చేశారు. 

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు జి.ఎస్‌.ఎస్‌.పి క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘గ‌తంలో నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అంతం చిత్రం క‌మ‌ర్షియ‌ల్ గా చాలా మంచి విజ‌యాన్ని సాధించింది. త‌రువాత మంచి క‌థ కోస‌మే ఇన్ని రోజులు ఆగాల్సి వ‌చ్చింది. ఇప్ప‌డు స‌మాజంలో జ‌రుగుతున్న ఒక మంచి పాయింట్‌ని చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా తెర‌కెక్కించాము. ఏడు చేప‌ల క‌థ చిత్రంతో చాలా ఫేమ‌స్ అయిన నేచుర‌ల్ ఆర్టిస్ట్ అభిషేక్ రెడ్డి హీరోగా సాక్షి నిదియా జంట‌గా న‌టించారు. ఈ చిత్రంలో భార్య‌, భర్త మధ్య ఉండే అన్ని ర‌సాలు క‌ల‌గలుపుగా వుంటాయి. పూర్తి రొమాంటిక్ కామెడీగా తెర‌కెక్కిస్తున్నాము. షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇటీవల విడుదల చేసిన ‘వైఫ్,ఐ’ ఫ‌స్ట్‌ లుక్ అండ్ మోషన్ పోస్ట‌ర్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. భార్యాభ‌ర్త‌ల మధ్య ప్రెజెంట్ ట్రెండ్‌లో ఉన్న అసూయ ద్వేషాలు, ఎప్ప‌టికో క‌నిపించే ప్రేమ దానిలో పొంగుకొచ్చే రొమాన్స్ ఇవ‌న్ని మించితే వారి జీవితాలు ఎలా ఉంటాయ‌నేది చాలా చ‌క్క‌గా మంచి కంటెంట్‌తో తెర‌కెక్కించాము. త్వ‌ర‌లో పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు మొదలుపెట్టబోతున్నాం..’’ అని అన్నారు

నిర్మాత జి. చ‌రితా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ నాకు ఈ క‌థ చెప్పిన‌ప్ప‌డు వెంట‌నే ఓకే చేశాను. ఎందుకంటే ఇలాంటి క‌థ‌లు ఈ జన‌రేష‌న్‌లో రావాలి. అంద‌రూ త‌ప్ప‌కుండా చూడాలి. వైవాహిక జీవితాలు నాశ‌నం అయిపోతున్న రోజులు. భార్యాభర్త మధ్య ప్రేమ‌లు పోయి అసూయ‌లు పెరుగుతున్న రోజులివి. అస‌లు వీటి కార‌ణం ఏమిటనేది తెలుసుకోలేకపోతున్నారు. ఈ క‌థ‌లో ఈ పాయింట్ నాకు బాగా న‌చ్చింది. మ‌నిష‌న్న ప్ర‌తి ఒక్క‌రూ తప్పులు చేస్తారు. ఆ త‌ప్పు ఏంటో తెలుసుకున్న నాడు ఎలాంటి స‌మ‌స్య కైనా ప‌రిష్కారం ఉంటుంది. చాలా చ‌క్క‌గా కళ్యాణ్ తెర‌కెక్కించాడు. అభిషేక్ రెడ్డి, సాక్షి ఈ క‌థ‌కి చాలా చ‌క్క‌గా సెట్ అయ్యారు. షూటింగ్ కార్యక్ర‌మాలు పూర్త‌య్యాయి. ఈ చిత్ర విజ‌యం పై మా యూనిట్ అంతా ధీమాగా ఉంది..’’ అని అన్నారు.

Tempt Ravi Wife, I Movie Shooting Completed:

Tempt Ravi Wife, I Movie Latest Update