తల్లికి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇస్తోన్న స్టార్‌..!

తమిళస్టార్‌ హీరో, సౌతిండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనను తాను నిరూపించుకునేందుకు తపన పడుతున్నాడు. ఇప్పటికే హీరోగా, గాయకునిగా, నిర్మాతగా.... అన్ని విధాలుగా తనను తాను ప్రూవ్‌ చేసుకుంటున్న ఆయన ప్రస్తుతం తన దర్శకత్వంలోనే 'పవర్‌ పాండీ' అనే వెరైటీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో తమిళనాట మంచి గుర్తింపు ఉన్న రాజ్‌కిరణ్‌ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. విశాల్‌ నటించిన 'పందెంకోడి'తో తెలుగు నాట కూడా గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత చరణ్‌కు తాతయ్యగా 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో నటిస్తూ, హఠాత్తుగా ఆ పాత్రలో చాన్స్‌ పొగొట్టుకున్న రాజ్‌కిరణ్‌ అంటే అందరికీ గుర్తుకు వస్తుంది. కాగా ధనుష్‌ ఈ చిత్రాన్ని తన సొంత బేనర్‌ అయిన వండర్‌ బార్‌ ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం విడుదల తేదీని కూడా ధనుష్‌ ప్రకటించాడు. తమిళ సంవత్సరాది అయిన ఏప్రిల్‌ 14, 2017న ఈచిత్రాన్ని విడుదల చేయనున్నామని, అదే రోజు తన తల్లి విజయలక్ష్మి పుట్టినరోజు కూడా కావడంతో ఇది తాను ఆమెకిస్తున్న బర్త్‌డే కానుకగా ధనుష్‌ ఈ చిత్రాన్ని పేర్కొన్నాడు. మరి ఈ చిత్రం దర్శకునిగా ధనుష్‌కి ఎంతటి పేరును తెస్తుందో వేచిచూడాల్సివుంది.

dhanush
dhanush mother vijaya lakshmi
april 14th 2017
power pandey movie
power pandey movie released on april 14th 2017
director dhanush
raj kiran