ఈ సినిమా 'రేసుగుర్రం' ను మించగలదా..!

CineJosh news

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా \'సన్ ఆఫ్ సత్యమూర్తి\'. ఈ సినిమా ప్రారంభమయినప్పటి  నుండి ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగాయి. దానికి తగ్గట్టుగా ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ భారీగా అమ్ముడుపోయాయని సమాచారం. 2014 లో అల్లు అర్జున్ నటించిన \'రేసుగుర్రం\' సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. సుమారుగా 58 కోట్లను సాధించి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. అలాగే \'సన్ ఆఫ్ సత్యమూర్తి\' కూడా 'రేసుగుర్రం' కు ధీటుగా వసూళ్లు సాధించి అల్లు అర్జున్ సినిమాలో ది బెస్ట్ సినిమాగా పేరు తెచ్చుకుంటుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. మెగాభిమానులు కూడా అవే అంచనాలతో ఉన్నారు.  కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

allu arjun
trivikram
son of sathyamurthy
theatrical rights