ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mokshagna Fans May Have to Wait Two More Years

రెండేళ్లు నందమూరి ఫ్యాన్స్ కి నిరీక్షణ తప్పదు

Mokshagna Fans May Have to Wait Two More YearsMokshagna Fans May Have to Wait Two More Years


ఐదారేళ్లుగా నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యే క్షణం కోసం నందమూరి అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో తెలిసిన విషయమే. అంతకుమించి ఈ రెండేళ్లు అంటే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ అనౌన్సుమెంట్ వచ్చి ఆగిపోయాక ఆ నిరీక్షణ మరింత ఎక్కువయ్యింది.

ఎట్టకేలకు విశ్వంభర ఫేమ్ వసిష్ఠ తో మోక్షజ్ఞ ఎంట్రీ షురూ అయ్యింది. మరి విశ్వంభర చిత్రం కోసం మెగా అభిమానులను మూడేళ్ళుగా వెయిట్ చేయిస్తూ ఇంకా స్పష్టత ఇవ్వని వసిష్ఠ మోక్షజ్ఞ విషయంలో ఎంత సమయం తీసుకుంటారో అని నందమూరి అభిమానులు భయపడుతున్నారు.

మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిన సమయం ఎప్పుడో దాటిపోయింది. ఆ లేట్ కే అభిమానులు అల్లాడిపోయారు. ఇప్పుడు వసిష్ఠ మళ్లీ మోక్షు ని ఆయన సినిమాని చెక్కి చెక్కి ఎన్నేళ్లు అభిమానులను వెయిట్ చేయిస్తాడో అనే భయం నందమూరి ఫ్యాన్స్ లో కనిపిస్తుంది. ఇప్పుడు అనౌన్సమెంట్ వచ్చినా విశ్వంభర విడుదలయ్యేవరకు, మోక్షు సినిమా పట్టాలెక్కదు.

మోక్షజ్ఞ-వసిష్ఠ సినిమా స్టార్ట్ అయ్యాక ఏ రెండేళ్లకో మోక్షజ్ఞ ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. 
 

Mokshagna Debut: Will Fans Have to Wait Until 2028