ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Telugu 10: Shivaji Is Back as the Buzz Host

బిగ్ బాస్: ఈసారి కూడా శివాజీనే

Bigg Boss Telugu 10: Shivaji Is Back as the Buzz HostBigg Boss Telugu 10: Shivaji Is Back as the Buzz Host


బిగ్ బాస్ సీజన్ 10 మొదలయ్యింది. నాగార్జున హోస్ట్ గా ఈ నెల 6 న సీజన్ ని మొదలు పెట్టారు. సెలబ్రిటీస్, కామనర్స్ కలిసి ఓ 16 మంది హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. రొటీన్ ఫార్ములాతోనే బిగ్ బాస్ 10 మొదలయ్యింది. అయితే ఈసారి అన్ని భాషలకు అంటే మలయాళ, కన్నడ, తమిళ, తెలుగు భాషలకు కలిపి ఒకే ప్రోమోతో బిగ్ బాస్ 10 మొదలు పెట్టారు.

ఇక హౌస్ లో కంటెస్టెంట్స్ ఎలా ఉన్నా.. ఆడియన్స్ వారిని తమ ఓటుతో ఎలిమినేట్ చేస్తారు. హౌస్ లో ఎలాంటి చిందులు వేసినా, హోస్ట్ నాగ్ ఎన్ని తిట్టినా.. ఎలిమినేట్ అయ్యి బయటికి వస్తే ఆ సీజన్ బజ్ లో హోస్ట్ గా వచ్చే వారు కంటెస్టెంట్స్ నుంచి అసలు నిజాలు రాబడతారు. అంటే కంటెస్టెంట్స్ అసలు రంగు బయట పెడతారన్నమాట.

గత సీజన్ కి నటుడు శివాజీ బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా ఫైర్ చూపించారు. ఈ సీజన్ కి కూడా శివాజీ నే బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా చేస్తున్నారు. మరి హౌస్ లో అసలు ఆట కన్నా బజ్ లో శివాజీ అడిగే ప్రశ్నలే హాట్ హాట్ గా కంటెస్టెంట్స్ నిజ స్వరూపాన్ని బయటపెడతాయి. 

Bigg Boss 10: Shivaji Returns, The Real Game Begins