కమ్ముల మొండితనం.. పల్లవి నిబద్ధత

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రిలీజ్ అయిన `ఫిదా` టాలీవుడ్‌లో ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంలో భానుమతిగా సాయి పల్లవి చేసిన నటన పలికిన తెలంగాణ యాస ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అయితే ఈ పాత్రను ఒప్పుకోవడానికి సాయి పల్లవి దర్శకుడు శేఖర్ కమ్ములను ఆరు నెలల సమయం కోరినట్లు విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే వైద్య విద్య పూర్తి చేసే క్రమంలో ఉన్న ఆమె, చదువుపై దృష్టి పెట్టడం కోసమే ఈ విరామం అడిగినట్లు సమాచారం.
సినిమా అంటే గ్లామర్ మాత్రమే కాకుండా విద్యకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సాయి పల్లవి భావించారు. ఆమె అభ్యర్థనను గౌరవించిన శేఖర్ కమ్ముల ఆరు నెలల పాటు వేచి చూసి మరీ ఆమెతోనే సినిమాను పట్టాలెక్కించారు. ఒకవేళ ఆ సమయంలో సాయి పల్లవి అందుబాటులో లేకపోతే భానుమతి పాత్రలో మరొకరిని ఊహించుకోవడం కష్టమని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ నిరీక్షణే చివరకు ఫిదా రూపంలో క్లాసిక్ హిట్‌ను పరిశ్రమకు అందించింది.
ఈ సంఘటన ద్వారా సాయి పల్లవికి వృత్తి పట్ల ఉన్న నిబద్ధత ,చదువు పట్ల ఉన్న గౌరవం మరోసారి స్పష్టమైంది. పాత్రలోని లోతును అర్థం చేసుకోవడానికి , భాషపై పట్టు సాధించడానికి ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఎంత సరైనదో సినిమా ఫలితం నిరూపించింది. నేడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఎదిగిన సాయి పల్లవి ప్రయాణం నిజానికి అప్పుడూ తీసుకున్న ఆరు నెలల నిర్ణయంతోనే బలమైన పునాది వేసుకుందని చెప్పొచ్చు.








































