శాకిని డాకిని షూటింగ్ ఫినిష్
Saakini Daakini Shooting Completedఓ బేబీ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో రూపొందుతున్న రెండో చిత్రం శాకిని డాకిని. డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
నివేదా థామస్ పుట్టిన రోజు సందర్భంగా నేడు (నవంబర్ 2) ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. శాకిని డాకిని టైటిల్ ఆసక్తికరంగా ఉండడంతో ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం విశేషం.
ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది.
Regina Cassandra, Nivetha Thomas, Suresh Productions, Guru Films and Kross Pictures Film Titled Saakini Daakini







































