అసలేం జరిగిందో పోస్టర్‌లో చెప్పారు

Sun 13th Jan 2019 06:36 PM
asalem jarigindi movie,asalem jarigindi movie poster launch,sriram,asalem jarigindi  అసలేం జరిగిందో పోస్టర్‌లో చెప్పారు
Asalem Jarigindi Movie Poster Released అసలేం జరిగిందో పోస్టర్‌లో చెప్పారు
Sponsored links

అస‌లేం జ‌రిగింది? చిత్ర పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన ఎంపీ సంతోష్ కుమార్ 

ఎక్సోడ‌స్ మీడియా నిర్మిస్తున్న అస‌లేం జ‌రిగింది? చిత్రం పోస్ట‌ర్‌ను ఎంపీ సంతోష్ కుమార్ శ‌నివారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆవిష్క‌రించారు. ఆయ‌న మాట్లాడుతూ.. శ్రీమ‌తి నీలిమా ప్రొడ్యూస‌ర్‌గా శ్రీరాం హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత‌వ‌ర‌కూ ఎవ‌రూ తీయ‌ని కొత్త ప్రాంతాల్లో షూటింగ్ జ‌ర‌పాల‌నుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ ఆరు నెల‌ల పాటు తెలంగాణ‌లోని వివిధ ప్రాంతాల‌ను సంద‌ర్శించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న కెమెరామ‌న్ ఎన్‌వీఆర్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. శ్రీరాం హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి మ్యూజిక్‌ను మ‌హావీర్ అందిస్తున్నారు. రామ‌గోపాల్ వ‌ర్మ నిర్మించిన భైర‌వ‌గీత విల‌న్ విజ‌య్ రామ్ ఈ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి క‌థ నెర్ర‌ప‌ల్లి వాసు అందించారు. ఫిబ్ర‌వ‌రి 11 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని... రెండు షెడ్యూళ్ల‌లో చిత్రీక‌ర‌ణ పూర్తి చేస్తామ‌ని నిర్మాత కె. నీలిమా తెలిపారు. 

పాట‌ల ర‌చయిత: చిర్రావూరి విజ‌య్ కుమార్‌,డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి, వెంక‌టేష్.  

విజ‌య్ ఏసుదాస్‌, విజ‌య్ ప్ర‌కాష్‌, యాజిన్ నిజార్‌, రాంకీ, భార్గ‌వి పిళ్లై  త‌దిత‌రులు చిత్ర గీతాల‌ను ఆల‌పించారు. 

Sponsored links

Asalem Jarigindi Movie Poster Released:

Asalem Jarigindi Movie Latest Updates

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019