ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ranabaali OTT Release: Netflix Accidentally Reveals the date

రణబాలి స్ట్రీమింగ్ డేట్ చెప్పి డిలేట్ చేసారు

Ranabaali OTT Release: Netflix Accidentally Reveals the dateRanabaali OTT Release: Netflix Accidentally Reveals the date


విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న కలయికలో రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన రణబాలి చిత్రం గత నెల అంటే అక్టోబర్ 15 న విడుదలైంది. దసరా స్పెషల్ గా విడుదలైన ఈ చిత్రానికి థియేటర్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఆతర్వాత విజయ్ దేవరకొండ-రష్మికలు సినిమాని బాగా ప్రమోట్ చేసారు.

ఆ దెబ్బకి మిక్స్డ్ టాక్ తోనే రణబాలి కి రూ.80 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక థియేటర్స్ లో మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించిన రణబాలి చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో చేజిక్కించుకుంది. రణబాలి ఎప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు.

తాజాగా రణబాలి చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ చెయ్యబోతున్నట్టుగా పోస్ట్ పెట్టింది. కానీ అంతలోనే నెట్ ఫ్లిక్స్ ఆ పోస్ట్ ని డిలేట్ చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది. మరి నెట్ ఫ్లిక్స్ అధికారికంగా రణబాలి ని ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తుందో చూడాలి.

Ranabaali OTT Release