BB10: రోహిత్ ఎలిమినేషన్: ఏం కథలు అల్లారురా
Bigg Boss Telugu 10: Rohit elimination – fans fire
బిగ్ బాస్ సీజన్ 10 నుంచి సడన్ ఎలిమినేషన్ అంటూ హౌస్ మేట్స్ ఓట్స్ తో ఎవరూ ఊహించని కంటెస్టెంట్ రోహిత్ ఎలిమినేట్ అయ్యాడు. రోహిత్ ఎన్ని తప్పులు చేసినా, ఎలాంటి వల్గారిటీ మాటలు మట్లాడినా గుడ్డలు చించేసుకునే అభిమానులు రోహిత్ ఎలిమినేషన్ ను తట్టుకోలేకపోయారు.
శనివారమే రోహిత్ ఎలిమినేషన్ లీక్స్ బయటకు రావడంతో బిగ్ బాస్ రివ్యూవర్స్ నెత్తి నోరు కొట్టుకున్నారు. ఇది అన్యాయం అన్నారు. ఇకపై బిగ్ బాస్ చూడక్కర్లేదు అన్నారు. మరోపక్క రోహిత్ ఫ్యాన్స్ రోహిత్ కి హోస్ట్ నాగార్జున, యాజమాన్యం సీక్రెట్ రూమ్ ఆఫర్ చేసారు, కానీ ఆత్మాభిమానం చంపుకుని సీక్రెట్ రూమ్ కి వెళ్ళను అన్నాడు.
దానితో రోహిత్ అమ్మను పిలిపించారు, ఆమె నచ్చజెప్పినా వినలేదు, ఆతర్వాత అగ్నిపరీక్ష జెడ్జి అభిజిత్ ని పిలిపించారు, అయినా రోహిత్ ఆత్మగౌరవాన్ని చంపుకోలేదు. ఆఖరికి బిగ్ బాస్ బజ్ శివాజీ ఇంటర్వ్యూ ని కూడా నాగార్జున ఆపించేసారు, మధ్యలో రోహిత్ బిగ్ బాస్ బజ్ ఆగిపోయింది, రోహిత్ ఎలిమినేషన్ పై నాగార్జున బిగ్ బాస్ యాజమాన్యం పై ఫైర్ అయ్యారు అంటూ.. అబ్బో చాలా కథలే అల్లారు.
కట్ చేస్తే రోహిత్ ని ఇంటి నుంచి స్టేజ్ పైకి రమ్మన్న నాగ్ నువ్వు పొటన్షియల్ ఉన్న ప్లేయర్ వి, కానీ కొన్ని తప్పులు నిన్ను ఇక్కడ నించోబెట్టాయి అని చెప్పి హగ్ ఇచ్చి కనీసం జర్నీ కూడా ప్లే చెయ్యకుండా పంపేశారు. దానితో రోహిత్ ఫ్యాన్స్ అవాక్కయ్యారు.
















































