ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Will Mokshagna make his Debut in 2026?

ఈ ఏడాది మోక్షు ఎంట్రీ ఉంటుందా?

Will Mokshagna make his Debut in 2026?Will Mokshagna make his Debut in 2026?


నందమూరి అభిమానులు ఎన్నేళ్ళగానో వెయిట్ చేస్తున్న క్షణం ఆసన్నమైంది. కానీ దానికి క్లారిటీ లేక వారు ఇంకా ఇంకా అయోమయంలోనే కనిపిస్తున్నారు. రెండేళ్ల క్రితం ప్రశాంత్ వర్మ తో వచ్చిన మూవీ అనౌన్సమెంట్ తోనే ఆగిపోయింది. ఇక ఈఏడాది రీసెంట్ గా మోక్షజ్ఞ ఎంట్రీని బాలయ్య అధికారికంగా ఖరారు చేసారు.

దర్శకుడు వశిష్ట నందమూరి వారసుడిని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతను తీసుకున్నారు. అది కూడా బిగ్ బ్యానర్ మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో. దానితో మోక్షజ్ఞ - వశిష్ట కాంబో మూవీ ని ఈ దసరాకి పూజా కార్యక్రమాలతో లాంచ్ చెయ్యబోతున్నారు అన్నారు. కానీ దసరా వెళ్లిపోవడంతో నందమూరి అభిమానులు బాగా డిజప్పాయింట్ అవుతున్నారు.

అసలు ఈ ఏడాది మోక్షజ్ఞ డెబ్యూ మూవీ పూజ కార్యక్రమాలు జరుగుతాయా, రెగ్యులర్ షూట్ తో మోక్షజ్ఞ సెట్ లోకి వెళతారా అనే అనుమానాలు మొదలయ్యాయి. మోక్షజ్ఞ డెబ్యూ కోసం సిద్దమే అయినా.. వశిష్ట మెడకు విశ్వంభర చుట్టుకుంది. అది వదిలితే కానీ.. మోక్షు మూవీపై క్లారిటీ రాదు అని తెలుస్తుంది. 

Nandamuri Mokshagna Teja's entry confirmed