ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Priyanka Chopra channels 'King Kylie' as she goes trick

కుమార్తె మాల్తీతో కలిసి వీధుల్లో ట్రిక్-ఆర్-ట్రీటింగ్!

Priyanka Chopra channels 'King Kylie' as she goes trickPriyanka Chopra channels 'King Kylie' as she goes trick

భారతీయ సంప్రదాయ వేడుకలను విదేశాల్లోనూ ఘనంగా నిర్వహించుకుంటూ ముందుండే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తాజాగా  హలోవీన్ సంబరాల్లోకి అడుగుపెట్టారు. ముద్దుల కుమార్తె మాల్తీ మేరీ జోనాస్ -భర్త నిక్ జోనాస్‌తో కలిసి పీసీ  చేసిన హలోవీన్ ట్రిక్-ఆర్-ట్రీటింగ్  సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ వేడుకలో పీసీ  ధరించిన `కింగ్ కైలీ గెటప్  విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఫెస్టివ్ సీజన్‌ను పూర్తిగా ఆస్వాదిస్తున్న ప్రియాంక, దీపావళికి ధరించిన ట్రెండీ డిజైనర్ దుస్తులను పక్కన పెట్టి, పూర్తిగా భిన్నమైన .. కూల్ లుక్‌ను ఎంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న  ఫ్యామిలీ ఫొటోలలో  కాస్ట్యూమ్ సెలెక్షన్ ఎంతో ఫన్నీగా  ఆసక్తికరంగా ఉంది. ఈ సందర్భంగా ప్రియాంక  పోస్ట్‌కు క్యాప్షన్ ఇస్తూ `ఇదొక విచిత్రమైన కలయిక.. ఒక కౌబోయ్.. ఒక ఘోస్ట్ ప్రిన్సెస్  కింగ్ కైలీ కలిసి ట్రిక్-ఆర్-ట్రీటింగ్‌కు వెళ్లారు.. అందరికీ హలోవీన్ శుభాకాంక్షలు` అంటూ  ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ హలోవీన్ పార్టీ కోసం ప్రియాంక సెలబ్రిటీ కైలీ జెన్నర్  ప్రసిద్ధ కింగ్ కైలీ శైలిని ఎంచుకున్నారు. పొడవాటి పింక్ విగ్, నల్లటి బీనీ, పెద్ద సన్‌గ్లాసెస్, బ్లాక్ క్రాప్ టాప్  మ్యాచింగ్ జాకెట్, ట్రౌజర్ ధరించి  స్టైలిష్‌గా కనిపించారు.  ఆమె భర్త నిక్ జోనాస్ వైట్ కౌబోయ్ హ్యాట్, బ్రౌన్ జాకెట్ ధరించి కౌబోయ్ అవతారంలో అలరించగా  గారాలపట్టి మాల్తీ మేరీ ఘోస్ట్ ప్రిన్సెస్ వలె తెల్లటి దుస్తులు కేప్ , హార్ట్-షేప్ సన్‌గ్లాసెస్‌తో  క్యూట్‌గా మురిపించింది.

 

Priyanka Chopra channels King Kylie for Halloween