హీరో మ‌ర్డ‌ర్ కేసులో బిగ్ ట్విస్ట్!

Twist in Renukaswamy Murder CasTwist in Renukaswamy Murder Cas

సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. కన్నడ స్టార్ హీరో దర్శన్  - పవిత్ర గౌడ ప్రధాన నిందితులుగా ఉన్న హై-ప్రొఫైల్ కేసు విచారణలో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అత్యంత కీలకంగా భావిస్తున్న ప్రధాన సాక్షి  పునీత్ ఎండీ కోర్టులో  వాంగ్మూలాన్ని మారుస్తూ ఊహించని షాక్ ఇచ్చారు. అసలు హత్య జరిగిన రోజు తాను ఆ షెడ్డులోనే లేనని, తనకు ఏ విషయమూ తెలియదని ఆయన పేర్కొనడం  కోర్టు వర్గాలతో పాటు కన్నడ పరిశ్రమలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

బెంగళూరులోని ಅగ్ర‌హారం సెంట్రల్ జైలు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హీరో దర్శన్ ..పవిత్ర గౌడ ఈ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాక్షి పునీత్ కోర్టు ముందు మాట్లాడుతూ.. హత్య జరిగిన రోజు (జూన్ 8, 2024) మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6:30 గంటల మధ్య కాలంలో పత్తనగరె షెడ్డులో  దారుణం జరిగిందని పోలీసులు భావిస్తున్నా? తాను మాత్రం ఆ సమయానికి ముందే అక్కడ నుండి వెళ్లిపోయినట్లు తెలిపాడు. తాను అక్కడి నుండి వెళ్లిపోయే సమయానికి కొందరు వ్యక్తులు అక్కడ ఉన్నప్పటికీ ఆ తర్వాత షెడ్డులో ఏం జరిగిందనే విషయం తనకిస్సలు తెలియదన్నారు.

ఈ విచారణలో పునీత్ మాట్లాడుతూ తాను అక్కడి నుండి భోజనం చేసి మలై మహేశ్వర హియర్స్‌కు వెళ్లేసరికి సాయంత్రం 6:30 అయింది. ఆ సమయంలో షెడ్డులో సెక్యూరిటీ గార్డ్‌తో పాటు మరికొందరు ఉద్యోగులు మాత్రమే ఉన్నారని.. ఆ తర్వాత అక్కడ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే దానిపై తన వద్ద ఎలాంటి సమాచారం లేదని కోర్టుకు తెలిపారు. అలాగే  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రదర్శించిన నిందితులను తాను గుర్తుపట్టలేనని, తనకు వారిని ఎవరినీ నేరుగా పోల్చుకోవడం సాధ్యం కాదని పేర్కొన్నారు.

జూన్ 10న మీడియా ద్వారా రేణుకాస్వామి హత్య వార్త తెలిసిన వెంటనే పోలీసులు తనను సంప్రదించారని పునీత్ వెల్లడించారు. పోలీసుల విచారణ భయంతో తాను కనకపుర సమీపంలోని తన స్వగ్రామానికి, ఆ తర్వాత హసన్‌కు వెళ్లినట్లు  అంగీకరించారు. ఆ సమయంలో తన మొబైల్ ఫోన్‌ను మార్చి కొత్త సాధారణ  హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేసినట్లు కూడా  కోర్టుకు తెలియజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రాసిక్యూషన్ తరఫు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్న పి. కుమార్  సాక్షిని క్రాస్-ఎగ్జామినేషన్ చేశారు.

ఈ కేసులో ప్రైమ్ విట్నెస్ అయిన పునీత్ పూర్తిగా మాట మార్చడంతో ఆయన `హోస్టైల్` గా మారిపోయినట్లు ప్రాసిక్యూషన్ బృందం భావిస్తోంది. ఈ కీలక పరిణామం దర్శన్ కేసు విచారణపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ విచారణకు సంబంధించిన తదుపరి ప్రక్రియను కోర్టు వాయిదా వేసింది.
 

Twist in Kannada actor Darshan case